telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ

ఎక్స్ ప్రెస్ టీవీ యజమాని జయరాం కేసులో మేనకోడలు అరెస్ట్…?

Shikha Chowdary main role in Jayaram Death Mystery
ఎక్స్ ప్రెస్ టీవీ యజమాని, కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరాం కేసు అనేక మలుపులు తిరుగుతున్నది. అయితే అక్రమ సంబంధం కారణంగానే ఆయన హత్యకు గురయ్యారని పోలీసులు విచారణలో వెల్లడైనట్లు సమాచారం. మేనకోడలు శిఖా చౌదరి, జయరాం మధ్య అక్రమ సంబందం ఉన్నట్లు పోలీస్ లు అనుమానిస్తున్నారు. అయితే అంతకు ముందే శిఖా చౌదరి కి రాకేష్ రెడ్డి అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. తన గర్ల్ ప్రెండ్, మేన కోడలు అయిన శిఖా చౌదరిని వదిలేయాలని జయరాం రాకేష్ ను కోరాడు. వదిలేసినందుకు తనకు మూడున్నర కోట్లు చెల్లించాలని రాకేష్ రెడ్డి డిమాండ్ చేశాడు. అందుకు సరే అని చెప్పడంతో ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది.Shikha Chowdary main role in Jayaram Death Mystery
అయితే ఒప్పందం ప్రకారం శిఖా ని రాకేష్ వదిలేశాడు. రోజులు గడిచినా అంగీకారం ప్రకారం ఇస్తానన్న మూడున్నర కోట్లు జయరాం ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వక పోవడం తో రాకేష్, శిఖా చౌదరీలు మళ్ళీ ఒక్కటయ్యారు. రాకేష్ సహాయంతోనే శిఖా జయరాం ను హత్యచేసి ఉండొచ్చు అని పోలీస్ లు బలంగా నమ్ముతున్నారు. జయరాం చనిపోయాక ఆయన ఇంటికి వచ్చిన శిఖా చౌదరి విలువైన డాక్యుమెంట్లు తీసుకువెళ్లినట్లు సమాచారం. వాచ్ మెన్ ను బెదిరించి ఇంటి తాళాలు తీసుకొని ఇంట్లోకి వెళ్లినట్టు పోలీసులు నిర్ధారించారు. jayaram murder case
రాకేష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంతకు ముందు రాకేష్ రెడ్డి నాలుగున్నర కోట్లు అప్పును శిఖకు ఇచ్చారు. డబ్బులు తిరిగి ఇవ్వకపోవడం వల్లే గొడవలు తలెత్తడం, ఇద్దరూ కలిసి జయరాం ను హత్య చేసి ఉండవచ్చని పోలీసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. బీరులో సైనెడ్ కలిపి విష ప్రయోగంతో చంపారని పోలీసుల విచారణలో వెల్లడైందన్నారు.చిగురుపాటి జయరాం అంత్యక్రియలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన భార్య, కుటుంబ సభ్యులు అమెరికాలో నివసిస్తున్నారు. వారు హైదరాబాద్ చేరుకోవడానికి మరింత సమయం పడుతుంది. కాబట్టి శనివారం అంత్యక్రియలు జరగకపోవచ్చని అంటున్నారు. మంచు తుఫాన్ కారణంగానే ఫ్లోరిడాలో జయరాం భార్య పద్మశ్రీ ఆగిపోయారు.
అక్కడి వాతావరణం మరో రెండు రోజులు అలాగే ఉంటుండడంతో వారి ప్రయాణం మరింత ఆలస్యం అవ్వొచ్చని సమాచారం. హైదరాబాద్ దసపల్లా హోటల్ లో నందిగామ పోలీసులు తనిఖీలు చేశారు. హోటల్ లోని సీసీ టీవీ పుటేజ్ స్వాధీనం చేసుకున్నారు. దసపల్లాలో జనవరి 31న  సాయంత్రం జరిగిన ఫార్మా కంపెనీ సమావేశానికి చిగురుపాటి జయరాం హాజరయ్యారు. సమావేశం తర్వాత వైట్ కలర్ షర్ట్ తో ఉన్న వ్యక్తితో కలిసి వెళ్లారు. దీంతో ప్రస్తుతం పోలీసులు వైట్ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తి గురించి ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ లో నందిగామ కు చెందిన ఐదు బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. 

Related posts