telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కామసూత్ర నటికి వర్మ శృంగార వీడియో

Sherlin-Chopra

ఎప్పుడూ ఎవరో ఒకరిపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మపై నటి షెర్లిన్ చోప్రా సంచలన కామెంట్స్ చేసింది. ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అసలేం జరిగిందంటే…. కామసూత్ర నటి, మోడల్ షెర్లిన్ చోప్రా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మతో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. “2016.. రాంగోపాల్ వర్మకు వాట్సాప్‌లో మెసేజ్ చేశాను. హాయ్ సార్.. ఇవి నా ఫోటోలు, ఇది నా వర్క్ ప్రొఫైల్. ఇప్పుడు మీరే ప్రాజెక్ట్స్ చేస్తున్నారో తెలుసుకోవచ్చా?.. మీ సినిమాల్లో నాకూ నటించాలనుంది. మీరు డైరెక్ట్ చేసిన సత్య,రంగీలా,కంపెనీ సినిమాలంటే నాకు చాలా ఇష్టం” అని మెసేజ్ చేశానని, దానికి రాంగోపాల్ వర్మ నుంచి “ఇది నా స్క్రిప్ట్… ఒక్కసారి చదివి నీ అభిప్రాయం చెప్పు” అంటూ రిప్లై వచ్చిందని షెర్లిన్ వెల్లడించింది. అయితే ఆ స్క్రిప్ట్ చదివాక.. అందులో స్టోరీ లేకపోవడంతో “సార్ అసలు ఇందులో స్టోరీ ఎక్కడుంది… కేవలం సెక్స్ సీన్స్ తప్ప. అసలు ఈ సినిమా కథాంశం ఏంటో తెలుసుకోవచ్చా..?” అని మెసేజ్ చేశానని తెలిపింది. దానికి వర్మ బదులిస్తూ “అవును.. అంతే… నేను పంపించిందే కథ” అని చెప్పినట్టు పేర్కొంది. దీంతో షెర్లిన్ “సార్ ఏక్‌థా రాజా ఏక్‌థి రాణి అని టైటిల్ పెట్టి ఇదేంటి సార్. రాణితో రాజు సెక్స్ చేశాడు.. అంతేనా.. అక్కడికే కథ అయిపోయింది.. ఇదేం కథా?” అని అడిగినట్టు చెప్పింది. అప్పుడు వర్మ “నీకు ఓకె అయితే చెప్పు.. ఈ ప్రాజెక్టు చేద్దాం” అంటూ ఓ కుక్క మహిళతో సెక్స్ చేస్తున్న అశ్లీల వీడియోను తనకు పంపించాడని చెప్పింది. ఇదెందుకు పంపించారని ఆయన్ను అడిగితే “సెక్స్ అనేది అత్యంత సాధారణ అవసరం అని నీకు తెలియజెప్పాలనుకుంటున్నా. మనుషులకైనా పశువులకైనా అది కావాల్సిందే. కాబట్టి దాన్నే కోరుకో.. ఎంజాయ్ చెయ్” అంటూ మెసేజ్ పెట్టాడంది. అయితే తానేమీ సెక్స్‌లో పీహెచ్‌డీ చేయలేదని.. ఇవేవీ తనకు తెలియదని తాను ఫైనల్ మెసేజ్ పెట్టానని షెర్లిన్ ముగించింది. అయితే వర్మపై కేసు ఎందుకు పెట్టలేదని అడిగితే.. ఆ ప్రాజెక్ట్ చేయమని ఆయన తననేమీ బలవంతపెట్టలేదని, అందుకే సైబర్ క్రైమ్ కేసు పెట్టలేదని చెప్పుకొచ్చింది.

Related posts