telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

వర్షపు చల్లగాలికి .. వెచ్చటి పిల్లగాలి అందాలు…

shelin chopra bold photo shoot

అలా చిరుజల్లు పడిందోలేదో, ఇలా ప్రకృతి సరికొత్తగా అందాలను సంతరించుకుంటుంది. ఈ వర్షం అంటే సినిమా వాళ్లకు కూడా చాలా ఇష్టం.. ప్రత్యేకించి హీరోయిన్ల అందాలు ఆరబోయడానికి వర్షానికి మించిన బ్యాక్ డ్రామ్ దర్శకులకు దొరకదేమో.. అందుకే.. ఎన్నో సినిమాల్లో ఈ వర్షం సాక్షిగా అందగత్తెలు సింగారులు ఒలికించారు. హాట్ హాట్ గా అందాలు ఆరబోయడంలో ఏమాత్రం వెనుకాడని సుందరాంగుల్లో నటి షెర్లిన్ చోప్రా ఒకరు. మాజీ మిస్ ఆంధ్ర అయిన ఈ అమ్మడు అందాల విందుతో ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. పెద్దగా సినిమా ఛాన్సులు లేకపోవడంతో హాట్ వీడియోలపైనే ఈ ముద్దుగుమ్మ దృష్టి పెట్టినట్టుంది. రెయినీ సీజన్ కావడంతో ఆ బ్యాక్ డ్రాప్ తో ఓ వీడియో చేసి రసప్రియుల కోసం వదలింది ఈ ముద్దుగుమ్మ. అంతకు ముందు.. టూపీస్ బికినీతో ఈత కొలనులో అందాలు ఆరబోస్తూ అదరగొట్టిన షెర్లీన్ చోప్రా.. ఇప్పుడు చీరలోనూ చూపించాల్సిన అందమంతా చూపించేసింది.

ఉండీలేనట్టున్న ఎర్ర పీలికలు రెండు కట్టుకుని.. ఈత కొలనులో ఈదుతూ హొయలుపోవడంలోనే కాదు.. నిండా చీరకప్పుకుని కూడా సెక్సీగా కనిపిస్తానని సవాల్ చేస్తోంది. అసలే వర్షం.. అందులోనూ అందాల ఆరబోతకు అడ్డులేదు.. ఇంకెలా ఉంటుంది.. వర్షంతో తడుస్తూ.. హొయలు పోతూ.. వీడియోను వేడెక్కించేసిందీ అమ్ముడు.. పసుపు పచ్చ చీర, రవికెలో తడిపొడి అందాలతో సందడి చేసింది.. కాస్త నృత్యం.. కాస్త హొయలు.. ఇదీ అమ్మడి ఊరించిన తీరు.. అయితే ఈ అందాల ప్రదర్శన అంతా తన సొంత యాప్ లోనే చేయడం కొసమెరుపు. టీజర్ చూపించేది ఫ్రీగానే అయినా.. అసలు వీడియోకు మాత్రం ఎంతో కొంత పైకం ముట్టజెప్పాల్సిందే.. మొత్తానికి సెలబ్రెటీలు సినిమాలతోనే కాదు.. ఇలా కూడా సంపాదిస్తున్నారన్నమాట. షెర్లిన్ చోప్రానే కాదు.. ఇంకా మరికొందరు హీరోయిన్లు కూడా ఇప్పుడు ఇదే బాట పడుతున్నారు.

Related posts