telugu navyamedia
telugu cinema news trending

పాకిస్థాన్ లో పెళ్ళికి హాజరైన ప్రముఖ హీరో… వెల్లువెత్తుతున్న విమర్శలు

Shathrugna-Sinha

బాలీవుడ్ ప్రముఖ సినీనటుడు, బీజేపీ మాజీ ఎంపీ శతృఘ్నసిన్హా పాకిస్థాన్ దేశంలో తాజాగా జరిగిన ఓ వివాహ మహోత్సవంలో ప్రత్యక్షం కావడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో శతృఘ్నసిన్హా పాకిస్థానీలతో స్నేహాన్ని కొనసాగించడం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద పాక్ పెళ్లిలో శతృఘ్నసిన్హా పాల్గొనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుల్వామాలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాది ఆత్మాహుతి దాడి ఘటనలో మన సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో బీజేపీ మాజీ ఎంపీ శతృఘ్నసిన్హా పాకిస్థాన్ దేశంలోని లాహోర్‌లో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని నవ్వులు చిందించడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. లాహోర్ నగరానికి చెందిన పాకిస్థానీ వ్యాపారవేత్త మియాన్ అసద్ అహసన్ ఆహ్వానంపై శతృఘ్నసిన్హా లాహోర్ నగరానికి వెళ్లి పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. శతృఘ్నసిన్హా పాకిస్థానీ ప్రముఖ నటి రీమాఖాన్ తో కలిసి వివాహ విందులో పాల్గొని నవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు.

Related posts

ఆసక్తికరంగా “పలాస 1978″లోని పాత్రలు

vimala p

బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా ప్రారంభం

vimala p

15 నెలల పాప ఒంటినిండా పంటిగాట్లు… డే కేర్ సెంటర్ నిర్వాకం

vimala p