శర్వానంద్, సమంత నటించిన ‘జాను’ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఈ సినిమా ప్రొమోషన్ కార్యక్రమాలను ఇప్పయికే చేపట్టారు చిత్రబృందం. అయితే టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో శర్వానంద్ ఒకరు. వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్న ఈ హీరో పెళ్లి గురించి మాత్రం నోరు మెదపడం లేదు. మీ పెళ్లెప్పుడు అని అడిగితే సమాధానం దాటవేసే శర్వానంద్ ఓ తాజా ఇంటర్వ్యూలో తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి మాట్లాడుతూ తనకు మజిలీలో సమంతలాంటి అమ్మాయి భార్యగా దొరికితే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అందుకు కారణం భర్త ఏం చేసినా సైలెంట్‌గా ఉండటమే కాదు.. భర్తను బాగా చూసుకుంటుంది కదా అందుకనే అని సమాధానం చెప్పాడు. మరి అలాంటి అమ్మాయి శర్వానంద్‌కు దొరుకుతుందో లేదో చూడాలి.
previous post