telugu navyamedia
సినిమా వార్తలు

పుట్టినరోజు స్పెషల్ : డాన్ లుక్ లో శర్వానంద్

sharwanand

అటు కుటుంబ కథా చిత్రాలకు, ఇటు యువతకు కనెక్ట్ అయ్యే హీరోల జాబితాలో శర్వానంద్ ముందు వరుసలో ఉంటాడు. వైవిధ్యమైన చిత్రాలతో వరుస విజయాలను అందుకుంటున్నాడు శర్వానంద్. అయితే తాజాగా ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు శర్వా. స్వామిరారా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా గ్యాంగ్ స్టర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి ప్రీ లుక్ ను విడుదల చేశారు చిత్రబృందం. ఈ సినిమాలో డాన్ గా కనిపించనున్నాడు శర్వానంద్. త్వరలోనే టీజర్ ను విడుదల చేయనున్నారు. శర్వానంద్ సరసన కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక తమిళంలో సూపర్ హిట్ అయిన “96” తెలుగు రీమేక్ లో కూడా శర్వానంద్ నటిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది.

Related posts