telugu navyamedia
telugu cinema news trending

అర్జున్ రెడ్డి దర్శకుడికి “నో” చెప్పిన శర్వానంద్

Sandeep-Reddy-Vangaa-and-Sharwanand

సినిమా ఇండస్ట్రీలో కొత్తగా వచ్చే దర్శకులకు ఒక్క హిట్ వచ్చిందంటే చాలు… స్టార్స్ సైతం ఆ దర్శకులతో సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తారు. అలాంటిది “అర్జున్ రెడ్డి” చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న సందీప్ రెడ్డి వంగాకు “నో” చెప్పాడట హీరో శర్వానంద్. ఇటీవలే శర్వానంద్ కు సందీప్ రెడ్డి వంగా ఒక కథను వినిపించాడట. అయితే శర్వానంద్ మాత్రం దాన్ని సున్నితంగా తిరస్కరించారట. అయితే ఈ విషయంపై స్పందించిన శర్వానంద్ తనకు కథ మాత్రమే నచ్చితే సరిపోదని, అందులో తన పాత్ర కూడా కంఫర్టబుల్ గా ఉండాలని అంటున్నాడు. నిజానికి సందీప్ రెడ్డి వంగా “అర్జున్ రెడ్డి” కథను ముందుగా శర్వానంద్ కే వినిపించాడట. అప్పుడు కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా చేయలేకపోయాడట శర్వానంద్. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇప్పుడు మరోసారి సందీప్ రెడ్డి వంగా కథను తిరస్కరించాడు శర్వానంద్.

మరోవైపు “అర్జున్ రెడ్డి” చిత్రంతో అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు మాత్రం వరుసగా అవకాశాలను కొట్టేస్తున్నారు. ప్రస్తుతం “అర్జున్ రెడ్డి” హిందీ రీమేక్ ను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్న సందీప్ కు మహేష్ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కూడా దొరికింది. ఇక శర్వానంద్ నటించిన “పడిపడి లేచే మనసు” చిత్రం ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

Related posts

అమిత్ షా, మోడీపై .. చర్యల విషయమై .. సుప్రీం సీరియస్ ..

vimala p

ప్రపంచ కప్ : .. గెలిచిన వారికో .. సిగరెట్.. పీక ..

vimala p

నాన్న ఇలా నన్ను చూస్తే చంపేస్తారు : జాన్వీ కపూర్

vimala p