telugu navyamedia
సినిమా వార్తలు

శర్వానంద్ సినిమాకు టైటిల్ సమస్య

Sharwanand images

శర్వానంద్ నటించిన “ప‌డి ప‌డి లేచె మ‌న‌సు” చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆయనకు నిరాశనే మిగిల్చింది. శ‌ర్వా చేతిలో ప్ర‌స్తుతం రెండు సినిమాలున్నాయి. డైరెక్ట‌ర్ సుధీర్ వ‌ర్మ సినిమాను ఇప్పటికే పూర్తి చేసిన శ‌ర్వా ఇప్పుడు “96” రీమేక్ షూటింగ్‌లో ఉన్నాడు. సుధీర్ వ‌ర్మ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్త‌యిపోయింది. ఈ నెలాఖ‌రున విడుద‌ల చేయాల‌నుకున్నారు. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల జూలైకు వాయిదా వేశారు. ప్రస్తుతం ఈ సినిమాను టైటిల్ స‌మ‌స్య వెంటాడుతోంది. ఈ సినిమాకు మొద‌ట్నుంచి “ద‌ళ‌ప‌తి” టైటిల్‌నే అనుకున్నారట‌. అయితే వేరొక‌రు ఈ టైటిల్‌ను రిజిస్ట‌ర్ చేయించ‌డంతో వీరికి ఇప్పుడు ఇబ్బంది ఎదురైంది. దీంతో “ర‌ణ‌రంగం”, “వ్యూహం” ఇలా ప‌లు టైటిళ్లు గురించి చర్చించుకున్నారట‌. అయితే ఈ క‌థ‌కు “ద‌ళ‌ప‌తి” టైటిల్ అయితేనే బాగుంటుందని అన్పించడంతో ఆ టైటిల్‌ను రిజిస్ట‌ర్ చేయించిన‌వారితో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్టు స‌మాచారం. కుద‌ర‌క‌పోతే వేరే టైటిల్ వేటలో పడతారని తెలుస్తోంది.

Related posts