telugu navyamedia
సినిమా వార్తలు

వీడియో : ఆసుపత్రి నుంచి శర్వానంద్ డిశ్చార్జ్

Sharwanand images

టాలీవుడ్ హీరో శర్వానంద్ ఇటీవల షూటింగ్ లో గాయపడిన విషయం తెలిసిందే. “96” తెలుగు రీమేక్ కోసం థాయ్‌లాండ్‌లో స్కై డైవింగ్‌లో శిక్ష‌ణ తీసుకుంటున్నాడు శ‌ర్వానంద్. షూటింగ్ లో స్కై డైవింగ్ చేస్తుండగా… ల్యాండ్ అయ్యే స‌మ‌యానికి గాలి ఎక్కువ‌గా రావ‌డంతో కాళ్ళ‌పై ల్యాండ్ కావ‌ల‌సిన అత‌ను భుజాల‌ని మోపి ల్యాండ్ అయ్యాడు. దీంతో శ‌ర్వానంద్ షోల్డ‌ర్ డిస్ లొకేట్ అయింది. కాలు కూడా ఫ్రాక్చ‌ర్ అయింది. కొద్ది రోజుల పాటు స‌న్‌షైన్ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్న శర్వానంద్ నిన్న డిశ్చార్జ్ అయ్యారు. ప్ర‌స్తుతం శ‌ర్వా ఆరోగ్య ప‌రిస్థితి బాగానే ఉంద‌ని, కొన్ని రోజుల విశ్రాంతి అనంతరం తిరిగి షూటింగ్‌లో పాల్గొన‌వ‌చ్చని వైద్యులు తెలిపారు. డైట్‌కి సంబంధించిన స‌ల‌హాలు సూచ‌న‌లు కూడా ఇచ్చారు. శ‌ర్వానంద్ ప్ర‌స్తుతం ర‌ణ‌రంగం చిత్రంతో పాటు 96 రీమేక్ చేస్తున్నాడు. 96 రీమేక్‌లో శ‌ర్వానంద్ స‌ర‌స‌న స‌మంత క‌థానాయిక‌గా న‌టిస్తుంది. త‌మిళ వ‌ర్షెన్‌ని తెర‌కెక్కించిన ప్రేమ్ కుమార్ తెలుగులోను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి జాను లేదా జానకి దేవి అనే రెండు టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు.

Related posts