telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

షారూఖ్ బర్త్‌డే కి .. బహుమతిగా బుర్జ్ ఖలీఫాపై పేరు ..

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ బర్త్‌డే సందర్భంగా ఆయన పేరుని ప్రపంచంలోని ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించారు. ‘కింగ్ ఆఫ్ బాలీవుడ్ షారూఖ్ ఖాన్ హ్యాపీ బర్త్‌డే’ అనే సందేశం బుర్జ్ ఖలీఫాపై ప్రత్యక్షం కాగా, ఇది చూసిన ప్రతి ఒక్క అభిమాని ఎంతగానో పులకరించిపోయారు. బుర్జ్ ఖలీఫాపై ఓ నటుడి పేరు ప్రదర్శించడం ఇదే తొలిసారి కాగా, ఈ విషయం విన్న షారూఖ్ కూడా తెగ సంతోషించాడు.

తన ట్విట్టర్‌లో వీడియోని షేర్ చేస్తూ..తన బర్త్‌డేకి ఇలాంటి గిఫ్ట్ ఇచ్చిన నిర్వాహకులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బర్త్‌డే ముందు రోజు రాత్రి షారూఖ్ ఇంటి దగ్గర అభిమానులు ఆయనకి బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపేందుకు భారీ ఎత్తున తరలివచ్చారు. వారందరికి చీర్స్ చెబుతూ కృతజ్ఞతలు తెలిపారు షారూఖ్‌.

Related posts