telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

టాలీవుడ్ నన్ను దూరం పెట్టింది… స్టేజీపై కన్నీటి పర్యంతమైన హీరోయిన్…!

Sanvi

ప్రముఖ నటి శాన్వి శ్రీవాస్తవ తెలుగులో ‘లవ్లీ’, ‘రౌడీ’, ‘అడ్డా’ తదితర సినిమాల్లో నటించిన శాన్వికి ఒక్క హిట్టు కూడా పడలేదు. ఆ తర్వాత ఆమెకు తెలుగులో అవకాశాలు రావడమే తగ్గిపోయాయి. దాంతో దాదాపు ఏడాదిన్నర పాటు ఖాళీగా కూర్చోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో శాన్వికి అదృష్టం తలుపు తట్టింది. కన్నడ నుంచి పిలుపు వచ్చింది. ‘కిరిక్ పార్టీ’ సినిమాతో మంచి విజయం అందుకున్న రక్షిత్ శెట్టికి జోడీగా నటించే అవకాశం వచ్చింది. అదే ‘అవనే శ్రీమన్నారయణ’ సినిమా. దీనిని తెలుగులో ‘అతడే శ్రీమన్నారాయణ’ టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. ఫ్యాంటసీ అడ్వెంచర్ కామెడీగా తెరకెక్కించిన ఈ సినిమాకు సచిన్ రవి డైరెక్ట్ చేశారు. బుధవారం సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా శాన్వి మాట్లాడుతూ స్టేజ్‌పై ఏడ్చేశారు. “నాది చాలా చిన్న వయసనో, లేక సరిగ్గా నటించననో, లేక అందంగా లేననో తెలీదు కానీ నాకు ‘రౌడీ’ సినిమా తర్వాత తెలుగులో అవకాశాలు రాలేదు. దాదాపు ఏడాదిన్నర పాటు చేతిలో సినిమాలు లేకుండా కూర్చున్నా. ఎన్నో రాత్రిళ్లు కుమిలిపోయా. ఎక్కడ తప్పు జరిగిందో తెలీక ఏడ్చాను. కానీ నాకు ‘అతడే శ్రీమన్నారాయణ’ ద్వారా తెలుగు ప్రేక్షకులను మళ్లీ పలకరించే అవకాశం వచ్చింది. తెలుగులో నాకు అవకాశాలు రాకపోవడంతో నాలో కాన్ఫిడెన్స్ పోయింది. కనీసం ఈ సినిమా ద్వారానైనా తెలుగు వారు నాలోని టాలెంట్‌ను గుర్తించి నాకు అవకాశాలు ఇస్తారని ఎదురుచూస్తున్నా” అంటూ కన్నీరుపెట్టుకున్నారు శాన్వి.

Related posts