telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

డెడ్ బాల్ కి … ఆరు రన్స్ ఇచ్చారు.. : షేన్‌వార్న్

shane warn on ODI world cup 2019

ఇటీవలే ముగిసిన వన్డే ప్రపంచకప్-2019 ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ్ గెలిచిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ ఓటమికి, ఇంగ్లాండ్ గెలుపుకు కారణం గప్టిల్ విసిరిన ఓవర్‌త్రోనే కారణమని క్రీడా పండితుల వాదన. రెండో పరుగు తేసే క్రమంలో గప్టిల్ విసిరిన బంతి స్టోక్స్ బ్యాట్ అంచుకు తగిలి బౌండరీ వెళ్లగా, అంపైర్ ధర్మసేన ఆరు పరుగులు ఇచ్చాడు. ఈ నిర్ణయంపై పలువురు క్రికెట్ విశ్లేషకులు తప్పు పట్టిన విషయం కూడా తెలిసిందే.

ఈ విషయంపై ఎమ్‌సీసీ(మెల్‌బోర్న్ క్రికెట్ క్లబ్) ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. ఎమ్‌సీసీ సభ్యుడైన షేన్‌వార్న్ ఈ విధంగా స్పందించాడు.. ఓవర్‌త్రో అంశంపై ఎంసీసీలో చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా మెంబరుగా నేను కూడా స్పందించాను. ఓవర్‌త్రో విసిరినప్పుడు బ్యాట్స్‌మన్ బ్యాట్‌కు గానీ, బాడీకి గానీ తగిలితే అసలు ఎలాంటి పరుగులు ఇవ్వకూడదు. దానిని డెడ్‌బాల్‌గా ప్రకటించాలి. బ్యాట్స్‌మన్ ప్రమేయం లేని సమయంలో పరుగులివ్వవచ్చు. అని ఆయన అన్నారు.

Related posts