telugu navyamedia
సినిమా వార్తలు

శ్రద్ధా కపూర్ పెళ్లి వార్తలకు బ్రేక్… మీడియాపై శక్తి కపూర్ ఫైర్

Shraddha

“సాహో” బ్యూటీ శ్రద్ధా కపూర్ మంచి హిట్లతో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. ప్రస్తుతం ఈ బాలీవుడ్ బ్యూటీ సాహో సినిమా షూటింగ్ తో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే శ్రద్దా కపూర్ ప్రేమ పెళ్ళి చేసుకోబోతోంది అనే వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి. గత కొంతకాలంగా శ్రద్ధా కపూర్, ప్రముఖ ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ట్ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే వీరిద్దరూ పెళ్ళి బంధంతో ఒక్కటి కానున్నారని కథనాలు కూడా ప్రచురితమయ్యాయి.

తాజాగా ఈ వార్తలపై శ్రద్ధా కపూర్ తండ్రి, సీనియర్ నటుడు శక్తి కపూర్ స్పందించి ఫైర్ అయ్యారు. తన కూతురు పెళ్ళి విషయంలో వస్తున్న వార్తల్లో నిజం లేదని, తన కూతురు తనకు చెప్పకుండా పెళ్ళి చేసుకోదని, మీడియాలో శ్రద్ధా గురించి వస్తున్నవన్నీ వార్తలన్నీ అవాస్తవమని, అందులో నిజం లేదని మండిపడ్డారు. శ్రద్ధా కపూర్ కు మరో ఐదేళ్ల వరకు పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యం లేదని, ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉందని స్పష్టం చేశారు శక్తి కపూర్. రోహన్ శ్రేష్ట్ తండ్రి రాకేష్ తనకు మంచి స్నేహితుడని, తమ పిల్లలు ప్రేమించుకుంటే ముందుగా తమకు చెప్తారని చెప్పుకొచ్చారు. దీంతో శ్రద్ధా పెళ్లి వార్తలకు బ్రేక్ పడింది. ఇక శ్రద్ధా కపూర్ ప్రస్తుతం అత్యంత్య ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న “సాహో” చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు జతగా నటిస్తోంది. ఇంకా శ్రద్ధా చిచోరే, స్ట్రీట్ డాన్స్ లాంటి పలు హిందీ చిత్రాలతో బిజీగా ఉంది.

Related posts