telugu navyamedia
క్రీడలు వార్తలు

బీసీబీ పై ఆగ్రహం వ్యక్తం చేసిన షకీబ్…

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తనను తప్పుగా చిత్రీకరించిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో బంగ్లాదేశ్‌ ఎలాగూ ఆడటం లేదనే ఉద్దేశంతోనే తాను ఐపీఎల్‌‌కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపాడు. ‘శ్రీలంకతో ఆడాల్సిన రెండు టెస్టుల సిరీస్‌.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో మాకు చివరిది. ఏలాగూ మేం ఫైనల్లో ఆడట్లేదు. ఆ పాయింట్ల పట్టికలో మా జట్టు చివరి స్థానంలో ఉంది. కాబట్టి, నేను ఆ సిరీస్‌లో ఆడినా, ఆడకపోయినా జట్టుకు వచ్చే నష్టం లేదు. కానీ ఐపీఎల్ ఆడటం ద్వారా జట్టుకు మేలు జరుగుతుంది. ఎలా అంటే.. ఈ ఏడాది చివర్లో భారత్‌లోనే టీ20 ప్రపంచకప్‌ జరగనుంది. అందులో మేం సాధించాల్సింది చాలా ఉంది. అదెంతో ముఖ్యమైన టోర్నీ. ఈ టెస్టు సిరీస్‌లో మేం సాధించాల్సింది ఏమీ లేదు. దీంతో ఐపీఎల్‌ ఆడటమే మంచిదని నేను అనుకున్నా’ అని షకీబ్‌ పేర్కొన్నాడు. అలాగే ఇకపై నేను టెస్టు క్రికెట్‌ ఆడనని చెప్పేవారందరూ.. నేను బీసీబీకి రాసిన లేఖను పూర్తిగా చదవలేదని… రాబోయే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకునే ఐపీఎల్‌లో ఆడాలనుకుంటున్నట్లు వివరించాను అని షకీబ్ అన్నాడు.

Related posts