telugu navyamedia
telugu cinema news trending

ఒక్క రాత్రికి 15 లక్షలు ఆఫర్ చేశారు : షకీలా

Shakila

సాఫ్ట్ పోర్న్ సినిమాలతో ఒకప్పుడు మలయాళం ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన హాట్ బ్యూటీ షకీలా. ఆమె సినిమా వస్తుందంటే పెద్ద హీరోలు కూడా భయపడేంతలా… అప్పట్లో తన సినిమాలతో యూత్ ను ఒక ఊపు ఊపేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షకీలా సంచలన విషయాలను బయటపెట్టింది. తాను వయసులో ఉన్నప్పుడు ఎలాంటి కష్టాలు పడిందో, తనను ఎవరెవరు మోసం చేసారో, నిర్మాతలు తనతో ఎలా నీచంగా ప్రవర్తించారో, రొమాంటిక్ సన్నివేశాలు తెరకెక్కించేటప్పుడు జరిగే వ్యవహారాలు ఈ ఇంటర్వ్యూలో తెలిపింది షకీలా. ఇప్పటి వరకు ఏడెనిమిది మందిని ప్రేమించాను. అందులో కొందరితో 4 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, చివరగా నితీశ్ కుమార్‌తో 10 సంవత్సరాలు ప్రేమ బంధం కొనసాగింది. వారితో నేను కాంప్రమైజ్ అయ్యుంటే పెళ్లి ఎప్పుడో అయ్యుండేది. షకీలా లగ్జరీ లైఫ్ అనేది నిజం కాదు. నాకు బ్యాంక్ బ్యాలెన్స్ అనేది లేదు. నేనేమీ లావిష్ జీవితం గడపటం లేదు. కంఫర్టబుల్ జీవితం గడుపుతున్నానంతే…. రోజూ మా ఇంటికి నలుగురు ఐదురుగు వస్తారు, తింటారు, తాగుతారు, ఆ ఖర్చు నేనే భరిస్తాను. నాకు కొంత మంది రాత్రికి 3 లక్షలు, 15 లక్షలు ఇస్తామని ప్రపోజల్ పెట్టారు. కానీ ఆ పనులు చేయకుడదనుకున్నాను. మందు పార్టీల్లో అబ్బాయిల కంపెనీ కంటే అమ్మాయిల కంపెనీనే కోరుకుంటాను. ఎందుకంటే అబ్బాయిలు చివరికి ఏమి కోరుతారో నాకు తెలుసు. అందుకే అమ్మాయిలతో మందు తాగడానికే ఇష్టపడతాను. సినిమాల్లో రొమాంటిక్ సెక్స్ సీన్లు చేసేపుడు అలసిపోయి నిద్రపోవడం లాంటి జరుగలేదు. అలా చేస్తే ఇష్టానికి డ్రెస్ ఎత్తేస్తారు. ఆ సమయంలో కాన్సియస్‌లోనే ఉంటాను. మీటూ, కాస్టింగ్ కౌచ్ లాంటివి ఓ సినిమాకు ఎదురైంది. సినిమా అయిపోయిన తర్వాత ప్రొడ్యూసర్ అడిగాడు. అతడి పేరు నేను చెప్పాలనుకోవడం లేదు” అని తన జీవితంలో జరిగిన కొన్ని చేదు అనుభవాలను వెల్లడించింది షకీలా.

Related posts

“వాల్మీకి” రిలీజ్ డేట్ ఫిక్స్

vimala p

విశ్వక్ సేన్ తో నాని సినిమా… ఫస్ట్ లుక్ విడుదల

vimala p

తెలంగాణాలో.. రేపు ఆటో-క్యాబ్ లు .. బంద్..

vimala p