telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“స్వదేశీ”లో షారుఖ్ తల్లి కిషోరీ బల్లాళ్‌ కన్నుమూత

Kishori

 సీనియర్‌ కన్నడ నటి కిషోరి బల్లాళ్‌ (82 సంవత్సరాలు) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందడంతో శాండల్‌వుడ్‌లో విషాదం నెలకొంది. బెంగళూరులోని ఆసుపత్రిలో ఆమె తుదిశ్వాస విడిచారు. దక్షిణ కన్నడలో జన్మించిన బల్లాళ్‌ 1960లో ‘ఇవలెంత హెందాతీ’ చిత్రంతో వెండతెరపై తెరంగ్రేటం చేశారు. అయిదు దశాబ్దాల సినీప్రయాణంలో సుమారు 75 సినిమాలకు పైగా నటించారు. ‘అయ్య’, ‘కెంపేగౌడ’, ‘నమ్మణ్ణ’, ‘గేర్‌ కానూని’ వంటి పలు కన్నడ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగులో వెంకటేష్ ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రంలోనూ నటించారు. ఆమె కెంపేగౌడ ప్రశస్తి, కన్నడ అకాడమీ ప్రశస్తి, ఐఫా ప్రశస్తిలను దక్కించుకున్నారు. విష్ణువర్ధన్‌, అంబరీష్‌, ప్రభాకర్‌, దర్శన్‌, సుదీప్‌లు నటించిన సినిమాల్లో నటించారు. బాలీవుడ్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ నటించిన ‘స్వదేశ్‌’ చిత్రంలో కావేరీ అమ్మగా ఆవిడ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ సినిమా తర్వాత ఆమె చిత్ర రంగానికి దూరంగా ఉంటూ సీరియళ్లలో నటిస్తున్నారు. ఈ క్రమంలో అమృతబల్లాళ్‌ కన్నడ మెగా సీరియల్‌ ‘వర్షిణి’లో నటించారు. కిశోరి బల్లాళ్‌ మృతికి కర్ణాటక చలనచిత్ర మండలి అధ్యక్షుడు జయరాజ్‌తో పాటు అనేక మంది సినీరంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Related posts