telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరో సౌత్ రీమేక్ కు షాహిద్ కపూర్ గ్రీన్ సిగ్నల్ ?

Shahid Kapoor

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ గతేడాది అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ “కబీర్ సింగ్”తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. తొలిసారి ఈ సినిమాతోనే 200 కోట్ల క్లబ్ లో స్థానం కూడా సంపాదించాడు. ఇక ప్రస్తుతం మరో రీమేక్ లో నటిస్తున్నాడు. గతేడాది తెలుగులో మంచి విజయం అందుకున్న ‘జెర్సీ’ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో జెర్సీ సినిమాను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి హిందీ వెర్షన్ ను కూడా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ప్రొడక్షన్ లో ఉండగానే షాహిద్ మరో రీమేక్ కు ఓకే చెప్పాడంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈసారి తెలుగు సినిమా కాదు, తమిళ చిత్రాన్ని రీమేక్ చేస్తాడట. తమిళంలో సూర్య హీరోగా తెరకెక్కి తెలుగులో “ఆకాశమే నీ హద్దురా” టైటిల్ తో విడుదల కావాల్సిన చిత్రాన్ని షాహిద్ రీమేక్ చేస్తున్నాడంటున్నారు. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది.

Related posts