telugu navyamedia
సినిమా వార్తలు

“కబీర్ సింగ్”తో షాహిద్ యాటిట్యూడ్ పెరిగిందా…? నెటిజన్లు ఫైర్

Kabir-Singh

“అర్జున్ రెడ్డి” సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిపోయాడు విజ‌య్ దేవ‌ర‌కొండ. ఈ సినిమాతో ఒక్కసారిగా విజయ్ దేవరకొండ ఫేట్ మారిపోవడమే కాకుండా యూత్ లో విపరీతమైన క్రేజ్ ను దక్కించుకున్నాడు. టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకు స్టార్ హోదాను తెచ్చిపెట్టిన “అర్జున్ రెడ్డి” చిత్రం “కబీర్ సింగ్” పేరుతో ఇటీవలే బాలీవుడ్ లో విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. మాతృకను రూపొందించిన సందీప్ వంగా ఈ రీమేక్‌కు కూడా డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. షాహిద్ క‌పూర్‌, కియారా ఆడ్వాణీ హీరోహీరోయిన్లుగా న‌టించారు. ఈ సినిమా హీరో షాహిద్ కపూర్‌తో పాటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు కూడా మంచి పేరు తీసుకొచ్చింది. ఐతే ఈ సినిమా విజయం తర్వాత షాహిద్ కపూర్ ప్రవర్తనలో చాలా తేడా వచ్చిందని, అతని యాటిట్యూడ్ చూపిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో షాహిద్ పై ఫైర్ అవుతున్నారు.

ఇటీవల షాహిద్ కపూర్ తన కూతురు మిషాను తీసుకుని ముంబైకి వచ్చారు. ఆయన వస్తున్న విషయం ముందే తెలుసుకున్న మీడియా కెమెరామెన్లు అక్కడ వెయిట్ చేయడం మొదలు పెట్టారు. అయితే కారులో నుంచి దిగిన షాహిద్ ఫోటో గ్రాఫర్లకు ఫోజులు ఇవ్వకుండా వెళ్లిపోయారు. దీంతో కబీర్ సింగ్ సక్సెస్ తర్వాత షాహిద్ యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. సక్సెస్ తలకెక్కినట్లు ఉంది అనే వాదన తెరపైకి వచ్చింది. షాహిద్ ప్రవర్తన సక్సెస్ సైడ్ ఎఫెక్ట్ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు గుప్పిస్తున్నారు. అయితే షాహిద్‌కు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు ఆయన అభిమానులు. తన చిన్నారి కూతురు ఉంది కాబట్టి షాహిద్ మీడియా వారి కెమెరా ముందు ఫోజులు ఇవ్వలేక పోయారని.. దీన్ని అంతగా భూతద్దంతో రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు.

Related posts