telugu navyamedia
Sexual Problems

శృంగారంలో ఇబ్బంది… హైపోస్పోడియాసిస్‌ అంటే ?

Sex

నా వయస్సు 27 సంవత్సరాలు. నాకు పుట్టినప్పటి నుండే హైపోస్పోడియాసిస్ సమస్య ఉంది. నా పురుషాంగం యు ఆకారంలో చిన్నగా, లోపలికి వంగి ఉండేది. నాకు 17 సంవత్సరాల వయసులో ఒక ఉచిత వైద్యశాలలో చూపించారు. వారు నాకు 5 దశలలో ఆపరేషన్స్ చేశారు. అవి పూర్తయ్యేసరికి నా వయస్సు 21 సంవత్సరాలు అయింది. కానీ, ఇప్పుడు నా సమస్య ఏమిటంటే నా అంగం కేవలం 4 సెం.మీ. మాత్రమే ఉంటుంది. స్తంభించిన తర్వాత 6 సె.మీ. ఉంటుంది. లావు కూడా తక్కువగా ఉంది. సెక్స్ చేయడానికి, పురుషాంగం పరిమాణానికి ఎలాంటి సంబంధం లేదని నాకు తెలుసు. కానీ, మరీ ఇంత చిన్న అంగంతో నేను నాకు కాబోయే భార్యను ఎలా సుఖపెట్టగలను?

హైపోస్పోడియాసిస్‌లో అంగం వంకరగా ఉండటంతోపాటుగా మూత్రరంధ్రం ఉండాల్సిన చోట కాకుండా అంగం కింద- పక్కల ఉండి వీర్యస్కలనమప్పుడు, మూత్ర విసర్జన సమయంలో ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాక, అంగ ప్రవేశ వేళ చాలా కష్టమవుతుంది. దీనికి ఐదు దశల్లో ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా ఖర్చుతో కూడిన ఆపరేషన్. నువు అదృష్టవంతుడివి. ఎందుకంటే, నీకు ఉచితంగా చక్కగా ఐదు దశల ఆపరేషన్ అయిపోయింది. అసలు సమస్య తీరిపోయింది. కానీ, నీ అపోహల వల్ల ఆందోళన, భయాలతో కొత్త సమస్యలోకి కూరుకుపోతున్నావు. నిజానికి అంగం గట్టిపడక ముందు 3.9 ఇంచుల (7-10 సెం.మీ.) లోపు ఉంటుంది. గట్టిపడ్డాక 4-7 అంగుళాలు (12-16 సెం.మీ.) ఉంటుంది. నీకు అంతా నార్మల్‌గానే ఉంది. అనవసరంగా ఆందోళన పడుతున్నావు. అంగ పరిమాణం ముఖ్యం కాదు. సంతృప్తి పరచడమే ముఖ్యం. నువు అతిపెద్ద సమస్య నుండి బయటపడ్డావు. అనుమానంతో ఆందోళనలో పడకు. 100 శాతం నీ భార్యని పూర్తిగా సంతృప్తి పరచగలవు. హాయిగా పెళ్ళి చేసుకో.

Related posts

నడుము నొప్పితో శృంగార సమస్యలు

ashok

శృంగారానికి ఆటంకంగా చెడు అలవాట్లు

vimala p

హస్తప్రయోగంతో కూడా .. క్యాన్సర్ నుండి దూరంగా ఉండొచ్చా..!!

vimala p