telugu navyamedia
Sexual Problems

ప్రాణం కంటే శృంగారం ముఖ్యమా ?

Benefits of sex

నా వయస్సు 57 సంవత్సరాలు. ఈ మధ్య అంగస్తంభన సమస్య మొదలైంది. హార్ట్‌లో స్టంట్ వేసారు. నేను వయాగ్రా వాడవచ్చా? మా బావగారు తను బీపీ ఉన్నా మెడికల్ షాప్‌లో కొనుక్కుని వాడతారు. నన్నూ వాడమంటున్నారు. పోనీ, సెక్స్ హార్మోన్స్ ఇంజెక్షన్లు టెస్టోస్టీరాన్ వాడచ్చా? 

మీ బావగారు డాక్టరు కాదు. పైగా బీపీ పెట్టుకొని డాక్టరు పర్యవేక్షణలో వయాగ్రా లాంటి ప్రమాదకర మందుని వాడుతూ మిమ్మల్నీ వాడమని తప్పుడు సలహా ఇస్తున్నారు. ముందు ఆయన్ని వయాగ్రా మానెయ్యమని చెప్పండి. బీపీ, గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులున్న వారు వయాగ్రా వాడకూడదు. అయితే, టెస్టోస్టీరాన్ రక్తంలో తగ్గితే ఖచ్చితంగా అంగస్తంభనలు తగ్గుతాయి.

పరీక్ష చేయించుకుని ప్రతి మిల్టీమీటరు రక్తంలో 3 నానోగ్రాముల కంటే తక్కువ ఉన్న వాళ్ళే ఈ టెస్టోస్టిరాన్ తీసుకోవాలి. ఒక్కోసారి ఈ ఇంజక్షను తర్వాత టెస్టోస్టిరాన్ హార్మోన్ల స్థాయి పడిపోయే అవకాశం ఉంటుంది. యాభై దాటాక టెస్టోస్టిరాన్ హార్మోను స్థాయి తగ్గుతూ వస్తుంది. వీరికి టెస్టోస్టిరాన్ ఆండ్రాలజిస్టు పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది. అలాగే, అంగస్తంభన సమస్యకు ఇతర కారణాలు కూడా కనుక్కోవాలి. మీకెలాగూ గుండె జబ్బువల్లే ఈ సమస్య వచ్చింది. కాబట్టి, మీరు వయాగ్రా అసలు వాడకండి. దానివల్ల హఠాత్తుగా గుండెపోటు రావచ్చు. బీపీ ఉన్న వాళ్ళు వయాగ్రా వేస్కున్నా ఇంతే! మీరు సెక్సాలజిస్ట్‌ని మీ భార్యతో సహా కలవండి. జీవించి ఉండటం కంటే సెక్సు ముఖ్యం కాదు కదా? కొన్ని మంచి ప్రాకృతిక మందులు వైద్య లక్షణాలున్న ఆహార పదార్థాలు వాడుకుంటూ మంచి శృంగార జీవితాన్ని మీ ఆరోగ్యం చెడకుండా పొందవచ్చు.

Related posts

శృంగారం శృతిమించి చేస్తే.. నరాల బలహీనత వస్తుందా…

vimala p

శృంగారంలో మధ్య వయస్కులకు టానిక్ ఇది

ashok

మీసం, గడ్డం రాని అబ్బాయి… శృంగార సామర్థ్యం తక్కువా ?

vimala p