telugu navyamedia
సినిమా వార్తలు

యాక్టింగ్ స్కూల్ కేసు… వినయ్ వర్మకు జైలు

vinay varma in police inquiry

నటనా శిక్షణ పేరుతో యువతులను వంచిస్తున్న కీచకుడు, సినీ నటుడు వినయ్ వర్మ ఆగడాలకు తెరపడింది. బట్టలు విప్పలేదనే కారణంతో ఓ యువతిని క్లాస్ నుంచి బయటకు పంపారనే వార్త మీడియాలోను, సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది. ఈ కేసులో హిమాయత్‌ నగర్‌లోని సూత్రధార్‌ యాక్టింగ్‌ స్కూల్‌ నిర్వాహకుడు వినయ్‌ వర్మను నారాయణగూడ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో అతన్ని అరెస్ట్‌ చేసిన పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం అక్కడి నుంచి జైలుకు తరలించారు. యాక్టింగ్‌ స్కూల్‌ పేరుతో వికృత చేష్టలకు పాల్పడుతున్నాడని, పై దుస్తులు విప్పితేనే నటనలో శిక్షణ ఇస్తానంటూ తనను వినయ్‌ వర్మ వేధించాడని ఓ అమ్మాయి తల్లిదండ్రులతో కలిసి షీటీమ్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో భాదితురాలు మీడియాతో మాట్లాడుతూ.. వినయ్ వర్మ తనను లైంగికంగా వేధించాడు. ఏప్రిల్ 3న యాక్టింగ్ వర్క్ షాపులో జాయిన్ అయ్యాను. ఏప్రిల్ 15వ తేదీ వరకు యాక్టింగ్ క్లాసులు అంతా సవ్యంగా సాగాయి. ఓ రోజు గది తలుపు, కిటీకిలు మూసి బట్టలు విప్పేయమని బలవంతం చేశాడు. లైంగికంగా వేధించాడు అని ఆరోపణలు చేసింది. నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి నారాయణగూడ పోలీసులు దర్యాప్తు చేశారు. కేసును ఆధారంగా చేసుకొని ఈ కోణంలో మరింత విచారణ చేస్తున్నట్టు తెలిసింది.

ఏప్రిల్ 17న బాధితురాలు ఫిర్యాదును ఆధారంగా తీసుకొని యాక్టింగ్ ఇనిస్టిట్యూట్‌లో సోదాలు నిర్వహించారు. బాధితురాలి ఆరోపణలపై వినయ్ వర్మను ప్రశ్నించగా.. బట్టలు విప్పడం నటనలో భాగమని, ఆమెకు అలా చేయడం ఇష్టం లేకపోతే బయటకు వెళ్లిపోమన్నాను అని ఆయన సమర్ధించుకొన్నారు. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. 30 ఏళ్లుగా నట శిక్షణలో వినయ్ వర్మ వినయ్ వర్మ సుమారు 30 సంవత్సరాల నుంచి థియేటర్, శిక్షణ రంగంలో ఉన్నారు. ఆయన పలు తెలుగు, హిందీ చిత్రాల్లో నటించారు. 20 సంవత్సరాల నుంచి ఆయన సూత్కధార్ అనే యాక్టింగ్ స్కూల్‌ను నిర్వహిస్తున్నారు. ఈయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి. గతంలో కూడా కొందరిని వేధించారని, కానీ అవి బయటకు పొక్కక పోవడం గమనార్హం.

Related posts