telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఆ ఎమోజీలు .. రద్దు చేసిన .. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్..

sexual emojis banned in social media

మితిమీరిన వాడకంతో ఇప్పటికే సామజిక మాధ్యమాలకు అన్నివర్గాల వారు బానిసలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో ఏ వార్త అయినా వారి మనసులపై విష ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువ. అలాంటివే లైంగిక సంబంధ విషయాలు.. అందుకే దానికి సంబందించిన ఎమోజీలను సామజిక మాధ్యమాలు రద్దు చేశాయి. తాజాగా సోషల్ మీడియాలో యూత్ ను పాడు చేసేలా ఉన్న ఎమోజీలతో కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఫిర్యాదుల రావడంతో కొన్ని ఎమోజీలను బ్యాన్ చేస్తున్నాట్లు ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ చెప్పాయి.

లైంగిక వాంఛను సూచించే వంకాయ, పిక్క ఉండే పీచ్‌ పండు, కింద పడుతున్న నీటి బిందువుల ఎమోజీలను బ్యాన్ చేస్తున్నట్లు తెలిపాయి. వీటితో సహా లైంగిక కోరికలను తెలియజేసే ఇతర ఏ ఎమోజీని వాడరాదంటూ సామజిక మాధ్యమాలు యూజర్లకు కొత్త రూల్స్ విడుదల చేశాయి. అలాగే నగ్న ఫొటోల పోస్టింగ్‌ ను కూడా నిషేధిస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించాయి. ఇవి ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో తెలియజేయలేదు. ఈ రెండు సామాజిక వేదికలను వేశ్యలు తమ లైంగిక వ్యాపారం కోసం వాడుకోకుండా నివారించేందుకే ఈ నిషేధం తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

Related posts