telugu navyamedia
crime news trending

ఘెర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు కార్మికులు మృతి

హిమాచల్‌ ప్రదేశ్‌లో ఘెర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సుకేత్‌ ఖాద్‌ వద్ద ఓ ప్యాసింజర్‌ వాహనం అదుపు తప్పి వంతెన పై నుంచి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా…  డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చంఢీగర్‌-మనాలి నేషనల్‌ హైవే మండి సమీపంలో పుల్ర్ఘత్‌ ప్రాంతంలో  వంతెనపై నుంచి సుకేత్‌ ఖాద్‌ లోయలో పడింది. ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న వెంటనే స్థాని సదర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. లోయలో పడ్డ కారు నుంచి మృతదేహాలను బయటకు తీసారు పోలీసులు. గాయాలైన డ్రైవర్‌ ను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారంతా బీహార్‌కు చెందిన కార్మికులుగా గుర్తించారు పోలీసులు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తు మొదలుపెట్టారు. డ్రైవర్ తప్పిదం ఎమైనా ఉందా అనే కోణంలో పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు. 

Related posts

రోహిత్‌ శర్మను ఔట్‌ చేయడం డ్రీం… : పాకిస్థాన్ యంగ్ ప్లేయ‌ర్ నసీమ్‌ షా

vimala p

ఐరన్ లోపానికి .. ఆహారం తో సరి..

vimala p

ఐన్‌స్టీన్ మెదడు చోరీ చేసి… 240 ముక్కలు చేసి… చివరకు…!?

vimala p