telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

వ్యాక్సిన్ ధరలు ప్రకటించిన కోవిషీల్డ్…

corona vaccine

మన దేశంలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే మన దేశంలో మే 1 వ తేదీ నుంచి కోవిషీల్డ్ వ్యాక్సిన్ నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేట్ ఆసుపత్రులకు విక్రయించబోతున్నది. మే 1వ తేదీ నుంచి 50శాతం కేంద్ర ప్రభుత్వానికి, మిగిలిన 50శాతం ఉత్పత్తిని రాష్ట్ర, ప్రైవేట్ ఆసుపత్రులకు విక్రయించబోతున్నారు.  రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కో డోస్ ను రూ.400 చొప్పున విక్రయించాలని నిర్ణయించగా, ప్రైవేట్ ఆసుపత్రులకు ఒక్కో డోస్ ను రూ.600 లకు విక్రయించాలని నిర్ణయం తీసుకున్నది.  ఇక రాబోయే నాలుగైదు నెలల తరువాత వ్యాక్సిన్ ను రిటైల్ మార్కెట్లో అందుబాటులోకి తీసుకొస్తామని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తెలియజేసింది. అయితే చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts