Trending Today క్రీడలు వార్తలు

అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌కు ఊహించని షాక్‌

Serena Williams fined Violations US Open

అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌కు ఊహించని షాక్‌ తగిలింది. శనివారం జరిగిన యూఎస్‌ ఓపెన్‌ మహిళల ఫైనల్‌ మ్యాచ్‌లో సెరెనా అనుచితంగా ప్రవర్తించిన తీరు పట్ల యూఎస్‌ టెన్నిస్‌ అసోషియేషన్‌ తప్పుపట్టింది. ఫైనల్‌ మ్యాచ్‌లో మూడు సార్లు నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను 17,000 యూఎస్‌ డాలర్ల జరిమానాను అసోషియేషన్‌ విధించింది. కోచ్‌ నుంచి సంకేతాల రూపంలో సలహాలు అందుకుంటోందని, ఇది నిబంధనలకు విరుద్ధమని చైర్‌ అంపైర్‌ సెరెనాకు హెచ్చరిక జారీ చేశారు.

ఈ హెచ్చరికలను విభేదించడం, అసహనంతో రాకెట్‌ విరగ్గొట్టడం, తీవ్ర పదజాలంతో చైర్‌ అంపైర్‌ను దూషించినందుకు గాను జరిమాన విధిస్తున్నట్లు అసోషియేషన్‌ పేర్కొంది. ఇక కెరీర్‌లో 24వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించి రికార్డు సృష్టిస్తుందని భావించిన సెరెనా విలియమ్స్‌ భవిష్యత్‌ టెన్నిస్‌ తార నయోమి ఒసాకా(జపాన్‌) చేతిలో బోల్తా పడింది. మరోవైపు యూఎస్‌ టెన్నిస్‌ అసోషియేషన్‌ సెరెనాకు జరిమాన విధించినప్పటికీ క్రీడల్లో అందరికి సమాన హక్కులు ఉండాలని.. పురుష ప్లేయర్లు చైర్‌ అంపైర్లను చాలా పరుష పదజాలంతో దూషించనప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తుచేశారు. క్రీడల్లో మహిళలకు, పురుషులకు వేరువేరు నిబంధనలు ఉండటం సమంజసం కాదని పలువురు మాజీ క్రీడాకారులు తప్పుపట్టారు. మహిళల టెన్నిస్‌ అసోషియేషన్‌, అభిమానుల నుంచి సెరెనాకు భారీ మద్దతు లభిస్తోంది.

Related posts

నేను పవన్ కళ్యాణ్ ని ప్రేమిస్తున్నాను… ఆయనతో కలిసి కొనసాగుతానేమో.. మాధవీలత

nagaraj chanti

మరో సారి స్వైన్ ఫ్లూ కలకలం…ఈ నెలలోనే నగరంలో ముగ్గురు…

chandra sekkhar

ముగ్గరు వెళ్లకూడదని సెంటిమెంట్ ఉంది.. అది తప్పాడు..మృత్యువాత పడ్డాడు…స్నేహితుడు…

chandra sekkhar

Leave a Comment