telugu navyamedia
రాశి ఫలాలు

సెప్టెంబర్ 20, సోమవారం రాశి ఫలాలు

మేషం…
ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖుల సాయం పొందుతారు. వివాదాల పరిష్కారం. బాకీలు కొన్ని వసూలవుతాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి.  ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లో వారికి ఒత్తిడి, చికాకులు పెరుగుతాయి. కుటుంబసభ్యుల మధ్య డబ్బుసంబంధిత విషయాల్లో కలహాలు ఏర్పడవచ్చును.

వృషభం…
పనుల్లో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. విద్యావకాశాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎప్పటి నుంచో వాయిదాపడుతూ వస్తున్న పనులు పూర్తిచేస్తారు. స్త్రీలకు తల, నరాలు, కాళ్లకు సంబంధించిన చికాకులను ఎదుర్కొంటారు.

మిథునం….
మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకున్నదొకటి, జరిగేది మరొకటి అయ్యే అవకాశాలున్నాయి.

కర్కాటకం…
శ్రమాధిక్యం. ముఖ్యమైన వ్యవహారాలు నిదానిస్తాయి.పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది.

సింహం…
సన్నిహితులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. ఉపాధ్యాయులు విద్యార్థుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు.

కన్య…
రావలసిన సొమ్ము అందుతుంది. శుభవార్తలు వింటారు. వాహనయోగం. మీ నిర్ణయాలు అంతా స్వాగతిస్తారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. కుటుంబంలో కలతలు, చికాకులు నిదానంగా సర్దుకుంటాయి. 

తుల….
విద్యార్థులకు కొంత నిరుత్సాహం. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తుల వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు. ఉపాధ్యాయులకు కార్యక్రమాలలో ఒత్తిడి అధికమవుతుంది.

వృశ్చికం….
కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. విదేశీయాన వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్త్రీల అభిప్రాయాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు.

ధనుస్సు….
ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. బాకీలు వసూలవుతాయి. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. బ్యాంకింగ్ వ్యవహారాలు, మధ్యవర్తిత్వాలకు సంబంధించిన విషయాల్లో ఏకాగ్రత ముఖ్యం.

మకరం….
వ్యవహారాలు మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. సంతానపరంగా మీరు తీసుకునే నిర్ణయాలు మేలు చేకూరుస్తారు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.

కుంభం…
శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలబ్ధి. పరిచయాలు పెరుగుతాయి. నూతన ఒప్పందాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.  మీ కుటుంబ విషయంలో ఇతరుల జోక్యం మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు.

మీనం….
పనులలో ప్రతిబంధకాలు. రుణాలు చేస్తారు. బ్యాంకింగ్ వ్యవహారాలు, మధ్యవర్తిత్వాలకు సంబంధించిన విషయాల్లో ఏకాగ్రత ముఖ్యం.ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. కుటుంబసమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.

Related posts