telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

రైల్వే బడ్జెట్ తరహాలో .. రైతులకు ప్రత్యేక బడ్జెట్ ..: రాహుల్ గాంధీ

AP Congress candidates list release shortly

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మొదటి సారిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. ఇందులో అయిదు అంశాలకు విశిష్ట స్థానం కల్పించింది. న్యాయ్ స్కీమ్‌తో నిరుపేదలకు కనీస ఆదాయం కల్పిస్తామని రాహుల్ అన్నారు. ప్రతి అకౌంట్‌కు మోదీ 15 లక్షలు ఇస్తానన్నారు, కానీ అదో అబద్దం అని తేలింది, పౌరులకు ఎంత ఇవ్వగలమో పార్టీ నేతలంతా కలిసి నిర్ణయించామని, పేదరికంపై యుద్ధం చేయాలని నిర్ణయించామని, అందుకే ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి 72వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు.

rahul gandhi to ap on 31stఇక ప్రభుత్వం ఉద్యోగానలను భర్తీ చేయడం రెండవ టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఉద్యోగాల కల్పన రెండవ అతిపెద్ద సమస్య అన్నారు. 22 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. వాటిని వెంటనే పూర్తి చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మరో 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అనుమతులు ఇవ్వడం మూడవ టార్గెట్‌. మొదటి మూడేళ్ల వరకు కంపెనీలు పెట్టుకునే వారు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వారికి పన్ను మినహాయింపులను కూడా కల్పించనున్నారు.

జాతీయ ఉపాధి హామీ పథకం కింద పని దినాలను 150 రోజులకు పెంచనున్నట్లు రాహుల్ చెప్పారు. రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు రాహుల్ చెప్పారు. రైల్వే బడ్జెట్ తరహాలో ప్రత్యేకంగా రైతులకు బడ్జెట్ సమర్పించనున్నట్లు రాహుల్ చెప్పారు. రుణాలు చెల్లించలేని రైతులపై క్రమినల్ చర్యలు తీసుకోమన్నారు. మొహుల్ చోక్సీ, విజయ్ మాల్యాలు దేశం విడిచి పరారయ్యారు, కానీ రైతులు మాత్రం జైలుపాలవుతున్నారు, అయితే రుణాలు చెల్లించలేకపోతున్న రైతులపై నేరాభియోగం ఉందని రాహుల్ అన్నారు. జీడీపీలో ఆరు శాతాన్ని విద్య కోసం ఖర్చు చేయనున్నారు. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేస్తామన్నారు.

Related posts