telugu navyamedia
సినిమా వార్తలు

“ఈగ”కు ఏడు సంవత్సరాలు

Eega

2012, జూలై 6న దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నాని, స‌మంత కీలక పాత్ర‌ల‌లో నటించిన ఫాంటసీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ “ఈగ‌”. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అనూహ్యమైన విషయాన్ని సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంటుంద‌ని ఇటీవ‌ల వార్తలు వచ్చాయి. అయితే “ఈగ” చిత్రం విడుద‌లై ఈరోజుతో ఏడేళ్ళు పూర్తైంది. ఈ సంద‌ర్భంగా చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేసిన కెకె సెంథిల్ కుమార్ స్పందిస్తూ “ఈగ చిత్రం నేటితో ఏడేళ్ళు పూర్తి చేసుకుంది. నేను ఇప్ప‌టి వ‌ర‌కు పని చేసిన చిత్రాల‌న్నింటికెల్లా ఎక్కువ ఛాలెంజింగ్ చిత్రం అంటే అది ఈగ అని చెప్ప‌వ‌చ్చు. ఇలాంటి అద్భుత చిత్రంలో నేను భాగం అయినందుకు సంతోషంగా ఉంది” అని సెంథిల్ కుమార్ ట్వీట్ చేశారు. “ఈగ” చిత్రం స‌క్సెస్‌లో న‌టీన‌టుల ప్ర‌తిభ‌నే కాక విజువ‌ల్ ఎఫెక్ట్స్ కూడా భాగం అయ్యాయి. క‌న్నడ హీరో సుదీప్ ఇందులో నెగెటివ్ పాత్ర‌లో క‌నిపించి మెప్పించాడు.

Related posts