రాజకీయ వార్తలు వార్తలు

వైసీపీపై చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి వైసీపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ సీపీ ని అసలు ప్రతిపక్షంగా గుర్తించలేమని అన్నారు. ఆ పార్టీ బీజేపీ కి తోక పార్టీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశానికి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలనుకునేవారు వస్తారని, రాని వారు ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

జగన్ నిన్న సీఎం కు ఏడూ ప్రశ్నలు సాoధించారని, కానీ ఒక్క ప్రశ్న కూడా ప్రధాని మోడీకి ఎందుకు వేయలేదని చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. జగన్ కు ప్రధాని మోడీ అంటే భయమని అందుకే ప్రధాని పేరు చెబితేనే జగన్ వణికిపోతాడని అన్నారు. ఎందుకంటే మోడీ చండశాసనుడని, జగన్ కేసుల భయంతోనే ప్రధాని గురించి పల్లెత్తు మాట కూడా మాట్లాడడని చంద్రమోహన్ రెడ్డి అన్నారు.

కాఫీ టీలు తాగడానికి తప్ప ఎందుకు పనికిరాదని అన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రమోహన్ రెడ్డి..రాజకీయాలపై పవన్ కళ్యాణ్ కు సరైన అవగాహన లేదని ఆయన అన్నారు. ఆయన గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం లేదని చంద్రమోహన్ రెడ్డి అన్నారు.

Related posts

తెలంగాణాలో 20 లక్షల ఓట్లపై పిటిషన్…వారంలోగా వివరణ ఇవ్వాలని ఈసీ కి సుప్రీం ఆదేశం…

chandra sekkhar

మావోయిస్టుల చేతిలో అరకు ఎమ్మెల్యే కాల్చివేత

madhu

కర్ణాటకలో … కాంగ్రెస్ దే హావ… కనుమరుగైన బీజేపీ…నేడే ఉపఎన్నిక ఫలితాలు…

chandra sekkhar

Leave a Comment