telugu navyamedia
సామాజిక

నేటి పాత్రికేయులకు మార్గదర్శకుడు వరదాచారి ..

సీనియర్ జర్నలిస్ట్ జి .ఎస్ వరదాచారి గారు 91వ సంవత్సరంలో అడుగు పెట్టిన సందర్భంగా వెటరన్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆయన కు జీవన సాఫల్య అభినందన కార్యక్రమాన్ని ఆదివారం రోజు ప్రెస్ కక్లబ్ లో ఏర్పాటు చేసింది .

ఈ సందర్భంగా వరదాచారి గారితో అనుబంధం వున్న సీనియర్ జర్నలిస్టుల వ్యాసాలతో ” పరిణత పాత్రికేయం జి .ఎస్ .వరదాచారి ” పేరుతో ఓ పుస్తకాన్ని తీసుకొచ్చారు .ఈ పుస్తకాన్ని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె .వి .రమణాచారి ఆవిష్కరించి తొలి ప్రతిని వరదాచారి గారికి బహుకరించారు .
ఈ సందర్భంగా – వరదాచారి ప్రతిభ, వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ . ఈ నటి యువ జర్నలిస్టులకు మార్గదర్శి అని చెప్పారు . ఆయన 91వ జన్మదినోత్సవాన్ని ఈరోజు జరపడం ఎంతో సముచితంగా , సంతోషంగా ఉందని చెప్పారు .

ఈ సభలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ – వరదాచారి నిబద్దత కలిగిన జర్నలిస్టు, ఎందరో గ్రామీణ జర్నలిస్టులకు మార్గనిర్ధేశనం చేశారని అన్నారు . వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్, హోసింగ్ సొసైటీ , ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ తో పాటు తెలుగు యూనివర్సిటీలో కూడా తన సేవలను అందించారని చెప్పారు .

సీనియర్ జర్నలిస్టు ఎమ్ .వి .ఆర్ .శాస్త్రి మాట్లాడుతూ -వరదాచారి గారికి ఎడిటర్ కాదగ్గ అన్ని అర్హతలు ఉన్నాయని , కానీ కాలేకపోయారని చెప్పారు. ఎంతో మంది జర్నలిస్టుల సమక్షంలో తనను సత్కరించడం మర్చి పోలేనని , అందరికీ కృతజ్ఞతలు అని వరదాచారి చెప్పారు .

” పరిణత పాత్రికేయం జి .ఎస్ .వరదాచారి ” పుస్తకంలో వ్యాసాలూ వ్రాసిన ఉడయవర్లు , దాసు కేశవ రావు , గోవిందరాజు చక్రధర్ , భండారు శ్రీనివాసరావు ,భగీరథ, లక్ష్మణ రావు ,ములుగు రాజేశ్వర రావులను రమణాచారి సత్కరించారు. ఈ కార్యక్రంలో ఎంతో మంది జర్నలిస్టులు పాల్గొని వరదాచారిని సత్కరించారు . .
వెటరన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కేశవ్ రావు మొదట స్వాగతం పలికారు . ఉపాధ్యక్షులు ఉదయవర్లు సంస్థ గురించి వివరించారు . కార్యదర్శి లక్ష్మణ రావు వందన సమర్పణ చేశారు .

Related posts