telugu navyamedia
ట్రెండింగ్ సామాజిక సినిమా వార్తలు

7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో “భారతమెరికా” పుస్తకావిష్కరణ

Bhageeradha

సీనియర్ జర్నలిస్ట్, రచయిత, కవి భగీరథ రచించిన “భారతమెరికా” పుస్తకం ఆవిష్కరణ ఈ నెల 10వ తేదీన 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో జరుగుతుంది. అంతర్జాలంలో జరిగే ఈ ఆవిష్కరణలో చాలా దేశాలు పాల్గొంటున్నాయి. భగీరథ రచించిన పుస్తకం “భారతమెరికా”ను అమెరికాలోని హ్యూస్టన్ లో నివసించే డాక్టర్ వంగూరి చిట్టెన్ రాజుగారికి అంకితం ఇచ్చారు. వంగూరి ఫౌండేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ సదస్సు భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి ప్రధాన ఉపన్యాసంతో మొదలవుతుంది. భారతదేశంలో అక్టోబర్ 10న మధ్యాహ్నం 1.30లకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ సదస్సులో “భారతమెరికా” పుస్తకాన్ని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి రమణాచారిగారు ఆవిష్కరిస్తారు. దర్శకులు ఎస్.వి కృష్ణా రెడ్డి గారు, నిర్మాత అచ్చి రెడ్డి గారు ప్రత్యేక అతిధులుగా పాల్గొంటున్నారు. కాగా రచయిత భగీరథ రచించిన ఈ పుస్తకం 14వది కావడం విశేషం.

Bhageeradha

Related posts