telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ముచ్చటగా మూడవసారి బాలయ్యతో స్నేహ ?

Sneha

ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ తన మూడవ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కి ముందు ఈ చిత్రానికి సంబంధించి కొంత షూటింగ్ కూడా జరిగింది. ఇక ఇందులో బాలకృష్ణ పోషించే ఒక పాత్రకు జోడీగా సీనియర్ హీరోయిన్ స్నేహను ఎంచుకున్నట్టు తాజా సమాచారం. ఇందులో బాలయ్య భార్యగా ఆమె కనిపిస్తుందట. స్నేహ వివాహానంతరం కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో స్నేహ, బాలకృష్ణతో మహారథి, పాండు రంగడు రెండు సినిమాలు చేసింది. ఇక ప్రధాన హీరోయిన్ గా నూతన నటిని పరిచయం చేయనున్నట్టు దర్శకుడు బోయపాటి శ్రీను ఇప్పటికే ప్రకటించారు. మరోపక్క ఇందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే సన్నివేశాలలో యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా నటించనున్నట్టు వార్తలొస్తున్నాయి. కరోనా పరిస్థితులు పూర్తిగా కుదుటపడ్డాక ఈ చిత్రం షూటింగును తిరిగి నిర్వహిస్తారు.

Related posts