telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

నాలుగు కోట్లకు మోసపోయిన .. సీనియర్ నటి..

Crime

సినీరంగం గురించి అన్నీ తెలిసిన ఓ సీనియర్ నటీమణి ఘోరంగా మోసపోయింది . హైదరాబాద్ లో ఉంటున్నఓ సీనియర్ నటి .. ఆమె ఎక్కువగా హాస్య , కుటుంబ కథా చిత్రాల్లో నటించారు. టీవీ సీరియళ్లకు ఆదరణ పెరుగుతుండడం చూసి అటువైపు అడుగులు వేయాలని ప్రయత్నించడం, అందులో విజయం సాధించడంతో..నాలుగైదేళ్ల నుంచి ఆ రంగంలో ఉన్నారు. తానే ప్రధాన పాత్రగా పలు సీరియళ్లలో నటించారు. అప్పుడు ఆమెకు జి.ఆర్. ఇంటి పేరుగా ఉన్న అన్నపూర్ణ, అనిత, అనిల్ కుమార్, జి.స్వరూప పరిచయమయ్యారు. తాము టీవీ సీరియళ్లను నిర్మించి పెద్ద నిర్మాతలకు హక్కులు విక్రయిస్తుంటామన్నారు. ముగ్గురు నిర్మాతలు మూడు సీరియళ్లు చేసి ఇవ్వాలని కోరారన్నారు. తాము రూ.4 కోట్లకు వాటిని నిర్మించి ఇస్తే.. వారు రూ.6 కోట్లు ఇస్తారంటూ ఆ సహాయ నటికి చెప్పారు.

వారి మాటలు గుడ్డిగా నమ్మేసిన ఆమె .. వారికి రెండేళ్ల క్రితం రూ.4 కోట్లు ఇచ్చింది. నలుగురూ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా అసలు, వడ్డీ ఎగేశారు. డబ్బుకోసం నిలదీస్తే చెల్లని చెక్కులు ఇచ్చారు. ఆమె గట్టిగా ప్రశ్నిస్తే దిక్కున్న చోట చెప్పుకో అంటూ బెదిరిస్తున్నారు. ఆ నటి చేసేదేమీ లేక సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. వారు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఓ సహాయ నటి నుంచి రూ.4 కోట్లు తీసుకొని ఎగవేసిన ఈ కేసు సినీరంగంలో హాట్ టాపిక్ అయ్యింది. తక్కువ ఖర్చుతో టీవీ సీరియళ్లు రూపొందిస్తాం.. రూ.4 కోట్లు రుణం ఇస్తే 20 నెలల్లో వడ్డీతో సహా తిరిగి ఇస్తాం’ అంటూ మోసగించిన తీరు చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

Related posts