telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అందులోనుండి ట్రంప్ బయటపడ్డాడుగా…

ఈ మధ్య అమెరికాలో జరిగిన ఎన్నికలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఒదిన విషయం తెలిసిందే. అయితే ఆయమా ఓడిపోయిన చాలా రోజులు తాను ఓడిపోలేదు మెరాయించారు. అందులో భాగంగానే జనవరి 6 వ తేదీన వాషింగ్టన్ డిసిలోని క్యాపిటల్ హిల్ పై ట్రంప్ మద్దతు దారులు దాడి చేసిన సంగతి తెలిసిందే.  ట్రంప్ రెచ్చగొట్టే విధంగా చేసిన వ్యాఖ్యలే దాడికి పురిగొల్పాయని డెమోక్రాట్స్ ఆరోపణలు చేసింది.  ట్రంప్ పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.  దీనిపై చర్చించిన తరువాత, ఓటింగ్ ను నిర్వహించారు.  ఈ ఓటింగ్ లో అభిశంసన తీర్మానానికి వ్యతిరేకంగా 57 ఓట్లు, అనుకూలంగా 46 ఓట్లు వచ్చాయి.  దీంతో ట్రంప్ పై పెట్టిన అభిశంసన తీర్మానం వీగిపోయింది.  దీంతో ట్రంప్ నిర్దోషిగా బయటపడ్డారు.  అమెరికా రాజకీయం మారుతుందని చెప్పడానికి ఇదొక నిదర్శనమని పేర్కొన్నారు.  ట్రంప్ పై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం నెగ్గేందుకు డెమోక్రాట్లు తీవ్రంగా శ్రమించారు.  రిపబ్లికన్లు ఏడుగురు ట్రంప్ పై ప్రవేశపెట్టిన అభిశంసనకు అనుకూలంగా ఓటు వేసినా, లాభం లేకపోయింది. అయితే ఇప్పుడు ఈ వార్త హల చల్ చేస్తుంది.

Related posts