telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు విద్యా వార్తలు

ఇక నుండి .. పాఠశాల విద్య కూడా.. సెమిస్టర్ విధానంలోనే..

telangana inter reverification answers online

విద్యాశాఖ కార్యదర్శి బీ జనార్దన్‌రెడ్డి ఇటీవల జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలు, మూల్యాంకన లోపల గురించి వివరణ ఇస్తూ, ఆయా విధానాలలో సంస్కరణలు తీసుకొస్తామని వెల్లడించారు. మూల్యాంకనం చేసేవారికి నిబంధనలు, విధులు, బాధ్యతలు తెలుపుతూ తయారుచేసిన అంగీకారపత్రంపై సంతకంచేయించే విధానాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. దీనివల్ల బాధ్యతగా జవాబుపత్రాలను దిద్ది, సరైన మార్కులు వేయడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ విధానాన్ని ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయన్నారు.

రాష్ట్రంలో పాఠశాలవిద్యలో సెమిస్టర్ విధానాన్ని అమలుచేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని, దీనిపై ఇప్పటికే సీఎం కార్యాలయం దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. దీనివల్ల విద్యార్థుల్లో వార్షికపరీక్షల ఒత్తిడి తగ్గిపోతుందని.. ప్రతి ఆరునెలలకు ఒకసారి పరీక్షలకు ప్రిపేర్‌కావడం వల్ల చదువులపట్ల ఆసక్తి పెరుగుతుందని వివరించారు. పాఠశాల విద్యాశాఖలో త్వరలోనే ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడానికి ప్రభు త్వం అంగీకరించిందని జనార్దన్‌రెడ్డి తెలిపారు. పదోన్నతులు పాత జిల్లాల ప్రకారం ఇవ్వాలా? కొత్త జిల్లా ప్రకారం కల్పించాలా? అన్న అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. పది జిల్లాలకు సంబంధించిన అంశంపై కోర్టులో కేసు ఉన్నదని, దీనికి పరిష్కారం చూపించి, పదోన్నతులు ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.

Related posts