telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

10 రూపాలకే బిర్యానీ అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్..

Locust-Biryani

కరోనా ముందువరకు ఫాస్ట్ ఫుడ్, బిర్యానీ అంటూ బయటి తిండి అలవాటు పడ్డవారు కూడా ఇంట్లో వండుకొని తినాల్సిన పరిస్థితి వచ్చింది.. అయితే, క్రమంగా సడలింపులు రావడంతో అన్నీ ఓపెన్‌ అవుతున్నాయి.. లాక్‌డౌన్‌ తర్వాత హోటెల్స్‌పై జనాలకు ఆసక్తి పెంచాలనే ఉద్దేశ్యంతో… చెన్నైలో పది రూపాయలకే బిర్యానీ అందించడం మొదలెట్టిన జహీర్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తమిళనాడులోని అరుప్పుకొట్టైలో ఆదివారంనాడు.. బిర్యానీ హోటల్‌ను ప్రారంభించిన జహీర్‌.. తొలి రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు కేవలం 10 రూపాయలకే బిర్యానీ అని ప్రకటించాడు. దీంతో బిర్యానీ కోసం జనం బారులుతీరారు. ఫలితంగా తోపులాట ప్రారంభమై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ప్రధానంగా కొవిడ్ నిబంధనల్ని గాలికొదిలేశారు. వాళ్లలో చాలా మంది మాస్కులు కూడా పెట్టుకోకపోవడంతో పోలీసులు హోటల్‌ యాజమానిపై చర్యలు తీసుకున్నారు. అతనిపై, 188, 269, 278 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకూడదని జహీర్‌ను హెచ్చరించి బెయిల్‌ పై వదిలేసారు.

Related posts