telugu navyamedia
సినిమా వార్తలు

యాంక‌ర్ ర‌వి “తోటబావి” ఫస్ట్ లుక్

Thota-Bavi

అంజి దేవండ్ల ద‌ర్శ‌క‌త్వంలో యాంక‌ర్ ర‌వి హీరోగా గౌత‌మి హీరోయిన్‌గా, గ‌ద్వాల్ కింగ్స్ స‌మ‌ర్ప‌ణ‌లో జోగులాంబ క్రియేష‌న్స్ ప‌తాకంపై ఆలూర్ ప్ర‌కాష్ గౌడ్ నిర్మిస్తోన్న చిత్రం “తోట‌బావి”. దౌలు (విష్ణుప్రియ హోట‌ల్), చిన్న స్వామి, అభినేష్.బి స‌హ‌నిర్మాత‌లు. ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ సోమవారం శేఖ‌ర్ మాస్ట‌ర్ చేతుల మీదుగా విడుద‌లైంది.

ఈ సంద‌ర్భంగా శేఖ‌ర్ మాస్ట‌ర్ మాట్లాడుతూ “తోట‌బావి టైటిల్ చాలా కొత్త‌గా ఉంది. యాంక‌ర్ ర‌వి హీరోగా న‌టిస్తోన్న ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ బాగుంది. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ఈ సినిమా మంచి పేరు తీసుకురావాల‌ని కోరుకుంటున్నాను” అన్నారు.

ద‌ర్శ‌కుడు అంజి దేవండ్ల మాట్లాడుతూ “యాక్షన్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో కొత్త కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న చిత్రం ‘తోట‌బావి’. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తైంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. హీరో ర‌విగారు ఇచ్చిన స‌పోర్ట్‌తో సినిమాను బాగా తీయ‌గ‌లిగాం. నిర్మాత‌లు ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమా క్వాలిటీగా రావ‌డానికి స‌హ‌క‌రించారు” అన్నారు.

నిర్మాత ఆలూర్ ప్ర‌కాష్ గౌడ్ మాట్లాడుతూ “మా సినిమా ఫ‌స్ట్ లుక్ లాంచ్ చేసిన డాన్స్ మాస్ట‌ర్ శేఖ‌ర్‌గారికి ప్ర‌త్యేక ధన్య‌వాదాలు. టైటిల్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ద‌ర్శ‌కుడు క‌థ‌, క‌థ‌నాలు చాలా ఇంట్ర‌స్టింగ్‌గా త‌యారు చేశారు. అదే విధంగా తెర‌కెక్కించారు. ర‌వి‌గారి స‌పోర్ట్ మ‌రువ‌లేనిది. త్వ‌ర‌లో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి సినిమాను సెప్టెంబ‌ర్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం” అన్నారు.

హీరోగా న‌టించిన యాంక‌ర్ ర‌వి మాట్లాడుతూ “టైటిల్ లాగే సినిమా అంతా కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. డైరెక్ట‌ర్ చెప్పిన‌దానికంటే కూడా అద్భుతంగా చిత్రీక‌రించారు. నిర్మాత‌లు ఎక్క‌డా రాజీ ప‌డ‌లేదు. సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు” అన్నారు.

Related posts