telugu navyamedia
సినిమా వార్తలు

అభాండాలు వేసి, బూతులు తిట్టారు : శేఖర్ మాస్టర్

Sekhar-Mastar

టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాకు డ్యాన్స్ మాస్టర్ గా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శేఖర్ మాస్టర్. ఒకవైపు సినిమాలకు డ్యాన్స్ మాస్టర్ గా పనిచేస్తూనే… మరోవైపు కొన్ని బుల్లితెర డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు శేఖర్ మాస్టర్. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి ఇప్పుడు ఈ స్థాయికి చేరుకోవదానికి తాను పడిన కష్టాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో శేఖర్ మాస్టర్ వెల్లడించారు.

డ్యాన్సర్ కావాలని ఇండస్ట్రీకి వచ్చిన శేఖర్ మాస్టర్ మొదట్లో అవకాశాలు లేక జూనియర్ ఆర్టిస్ట్ గా పని చేశానని చెప్పుకొచ్చారు. తన మొదటి సంపాదన 75 రూపాయలని, వాటిని చూసి చాలా సంతోషించానని చెప్పుకొచ్చారు ఆయన. ఇక ఇండస్ట్రీలో ఒక డ్యాన్స్ మాస్టర్ ను ఎంతగానో అభిమానించి ఆయన పేరును చేతిపై పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నానని, అయితే ఆ మాస్టర్ మాత్రం తనపై అభాండాలు వేశారని, ఒకప్పుడు ఆయన రాత్రిళ్ళు ఫోన్ చేసి బూతులు తిట్టేవారని, ఉదయాన్నే వచ్చి రాత్రి తాగి ఉండడం వల్ల అలా మాట్లాడాను ఏమీ అనుకోవద్దని చెప్పేవారని, ఓరోజు ఇంటికి పిలిపించుకుని మరీ తిట్టడంతో బాగా హర్ట్ అయ్యానని, అందుకే జీవితంలో ఇంకోసారి మీ దగ్గరకు రానంటూ ఆయన మొహం మీదే చేసి వచ్చానని స్పష్టం చేశారు శేఖర్ మాస్టర్.

Related posts