telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నందమూరి బాలకృష్ణ ఎంతో మంచోడు : యంగ్‌ హీరో

ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ ఎంతో మంచివాడని.. ఆయనది గొప్ప మనసు అని అందరూ చెబుతుంటారు. ఆయన ఎందరికో సహాయం కూడా చేసిన విషయం తెలిసిందే. హర్ష కనుమల్లి – సిమ్రాన్‌ చౌదరి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌ టైనర్‌ “సెహరి ” విర్గో పిక్చర్స్‌ బ్యానర్‌లో ప్రొడక్షన్‌ నెం. 1 గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను ఈ సోమవారం రోజున నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. బాలకృష్ణ ఈ సందర్భంగా సినిమా మంచి విజయం సాధించాలని చిత్ర యూనిట్‌ కి విషెస్‌ చెప్పారు. సినిమా తీస్తున్నప్పుడు నిర్మాత ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకోవాలన్నారు. సినిమాను బడ్జెట్‌లో ఉంచేందుకు ప్రయత్నించాలని పేర్కొన్నారు. అయితే ఈ పోస్టర్ రిలీజ్‌ సందర్భంలో హీరో చేతిని బాలయ్య కొట్టడం కనిపించింది. దీంతో ఎవరికీ నచ్చినట్టు వారు వార్తలు రాసుకున్నారు. హీరోని బాలయ్య కొట్టాడని, ఇది దారుణమని ట్రోల్‌ చేశారు. అయితే.. దీనిపై సెహరి హీరో హర్ష్‌ కనుమిల్లి స్పందించాడు. బాలయ్య మనసు బంగారమని.. ఆయన తనను కావాలని కొట్టలేదని పోస్టర్‌ను తాను ఎడమ చేత్తో పట్టుకున్నానని అది తప్పు, కుడి చేతితో పట్టుకో అంటూ సరదాగా ఆయన సరదగా నా చేతిని తాకారని చెప్పాడు.

Related posts