బాలయ్య బాబు ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం విదితమే. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే… హర్ష కనుమల్లి – సిమ్రాన్ చౌదరి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ “సెహరి ” విర్గో పిక్చర్స్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం. 1 గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. బాలకృష్ణ ఈ సందర్భంగా సినిమా మంచి విజయం సాధించాలని చిత్ర యూనిట్ కి విషెస్ చెప్పారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ.. సినిమా తీస్తున్నప్పుడు నిర్మాత ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకోవాలన్నారు. సినిమాను బడ్జెట్‌లో ఉంచేందుకు ప్రయత్నించాలని పేర్కొన్నారు. ఇక నా సినిమాలో అన్ని అంశాలు ఉండాలని అభిమానులు కోరుకుంటారని.. ఫైట్లు, డైలాగులు, డ్యాన్సులు, ఏవి లేకపోయినా… ఫ్యాన్స్ ఒప్పుకోరని తెలిపారు బాలయ్య. సామాజిక సేవ చేయడం తమ రక్తంలోనే ఉందని.. ఎన్ని చేసినా సినిమాల్లో నటించడమే తనకు సంతృప్తి ఇస్తుందని వెల్లడించారు.
previous post
పవన్ కల్యాణ్ అంటే నాకు ప్రాణం.. స్వామి భక్తిని చాటుకున్న బండ్ల గణేశ్