telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

‘సీటీమార్’ టీజర్ వచ్చేది ఎప్పుడంటే..?

తెలుగు స్టార్ హీరోల్లో గోపీచంద్ కూడా ఒకడు. ఎగ్రెసివ్ హీరోగా పేరు తెచ్చుకున్న ఈ హీరో గత కొన్నాళ్లుగా సరైన హిట్ లేక వెనకబడ్డాడు. ప్రస్తుతం గోపీచంద్ చేస్తున్న తాజా చిత్రం సీటీమార్. ఈ సినిమాను సంపత్ నంది దర్శకత్వం చేస్తున్నాడు. క్రీడా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కీలక పాత్రలో చేస్తోంది. ఇక హీరోయిన్ విషయానికొస్తే దిగంగన సూర్యవంశీ ఇందులో చేస్తోంది. ఇందులో గోపీచంద్ కోచ్ పాత్రలో కనిపించనున్నాడు. చిత్రంలో హీరో ఆంధ్రా ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా చేస్తున్నాడు. అదే తరహాలో మిల్కీ బ్యూటీ తమన్నా తెలంగాణ టీం కోచ్‌గా నటిస్తోంది. వీరిద్దరి మధ్య నడిచే లవ్ కం రివేంజ్ డ్రామాగా సినిమా నడుస్తుందని అంటున్నారు. మంచి హిట్ కోసం చూస్తున్న గోపీచంద్ ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడని తెలిసింది. ఇక ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుని ఏప్రిల్‌ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ అప్డేట్లను ఇస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను రేపు ఉదయం 10:36 కు విడుదల చేయనున్నారు. ఈమేరకు చిత్రబృందం పోస్టర్ విడుదల చేసింది.

Related posts