telugu navyamedia
crime

లేడీస్ హాస్టల్ .రహస్య కెమెరాలు అమర్చి చిత్రీకరణ!

Secret camers on hostel
చెన్నైలోని ఓ లేడీస్ హాస్టల్ బాత్ రూముల్లో రహస్య కెమెరాలు బయటపడటం తీవ్ర కలకలం రేపుతోంది. ఆదంబాక్కం పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, తిల్లై గంగా నగర్ లో సంపత్ రాజ్ (48) అనే వ్యక్తి లేడీస్ హాస్టల్ నిర్వహిస్తుండగా, వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగినులు ఇక్కడ ఉంటున్నారు. బాత్ రూములు, హాల్స్ లోని ఎలక్ట్రికల్ సాకెట్లు, కర్టెన్ రాడ్లు తదితర ప్రాంతాల్లో సంపత్ రాజ్ రహస్యంగా కెమెరాలు అమర్చి, వాటి ద్వారా అమ్మాయిల దృశ్యాలను చిత్రీకరించాడు.
రూములను తనిఖీలు చేయడానికి అంటూ తరచూ అతను యువతుల గదుల్లోకి వచ్చిపోతూ ఉండటం, అతను వచ్చిన సమయంలో తమను బయటకు వెళ్లాలని ఆదేశిస్తుండటంతో హాస్టల్ లో బస చేస్తున్న వారికి అనుమానం వచ్చింది. గదుల్లో రినోవేషన్ వర్క్ ఉందని తమకు చెబుతూ, కెమెరాలు అమర్చుతుండేవాడని గుర్తించిన వారు పోలీసులను ఆశ్రయించారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, హాస్టల్ గదుల్లో అమర్చిన కెమెరాలను, వాటి ఫుటేజీలను స్వాధీనం చేసుకుని సంపత్ రాజ్ ను అరెస్ట్ చేశారు. రెండు నెలల క్రితమే ఈ హాస్టల్ ను సంపత్ రాజ్ ప్రారంభించాడని, ఇక్కడ ఆరుగురు ఐటీ ఉద్యోగినులు, ఓ నర్సు బస చేస్తున్నారని తెలిపారు.
డిసెంబర్ 2వ తేదీన ఓ యువతి తన ఆండ్రాయిడ్ ఫోన్ లో ‘హిడెన్ కెమెరా డిటెక్టర్’ అనే యాప్ ను డౌన్ లోడ్ చేసుకుందని, దానితో చెక్ చేయగా, బాత్ రూములో అమర్చిన రహస్య కెమెరా కనిపించిందని వెల్లడించారు. ఆపై తమకు వారు ఫిర్యాదు చేశారని, తమ దాడిలో మొత్తం 9 కెమెరాలు బయటపడ్డాయని తెలిపారు. నిందితుడి ల్యాప్ టాప్ లో హాస్టల్ విద్యార్థుల నగ్న దృశ్యాలున్నాయని, అతన్నుంచి 18 స్మార్ట్ ఫోన్లు, రెండు ల్యాప్ టాప్ లను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ప్రస్తుతం కేసును విచారిస్తున్నామని పోలీసు అధికారులు వెల్లడించారు. సంపత్ రాజ్ ను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Related posts

బాలిక ఆత్మహత్యాయత్నం.. పరీక్ష కోసం కాదు.. అత్యాచారం జరిగినందుకే.. !!

vimala p

ఓటుకు నోటు కేసులో ఈడీ విచారణకు కాంగ్రెస్ నేత హాజరు

vimala p

హైదరాబాద్‌లో  ఉగ్రవాదులు .. ఎన్ఐఏ అధికారుల సోదాలు!

ashok