telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

భార్యను చంపడానికి ఆ భర్త ఏం చేశాడో తెలిస్తే షాక్

New couples attack SR Nagar

మిచిగాన్ లో ఓ భర్త చేసిన పని భార్య ప్రాణాల మీదకు వచ్చింది. అతని పేరు బ్రయాన్ కోజ్లోస్కి. ఓ భార్య, ముగ్గురు పిల్లలతో సంతోషంగా ఉన్న అతని జీవితంలో రెండేళ్ల క్రితం అవాంఛనీయ ఘటనలు జరిగాయి. భార్యాభర్తలిద్దరి మధ్యా మనస్పర్థలు పెరిగాయి. దీంతో విడిపోవడమే మంచిదని బ్రాయన్ భార్య థెరిస్సా గతేడాది విడాకుల కోసం దరఖాస్తు చేసింది. విడాకులు వచ్చేవరకు పిల్లల కోసం భర్తతో కలిసే ఉండటానికి నిర్ణయించుకుంది. ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్లేముందు భర్త చేసే కాఫీ తాగడం ఆమెకు అలవాటు. విడాకుల కోసం దరఖాస్తు చేసిన తర్వాత కూడా వీరిద్దరూ అదే అలవాటును కొనసాగించారు. ఆ తర్వాత కొన్ని రోజులకు తన ఆరోగ్యం పరిస్థితి క్షీణిస్తున్నట్లు థెరెస్సా గుర్తించింది. భర్త మీద అనుమానం రావడంతో ఇంట్లో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసింది. కొన్ని రోజుల తర్వాత ఆ కెమెరాల ఫుటేజి పరిశీలించిన థెరెసా షాకైంది. ఉదయాన్నే ఇచ్చే కాఫీలో తన భర్త విషం కలుపుతున్నట్లు గుర్తించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. థెరెస్సా తాగే కాఫీలో డిఫెన్‌హైడ్రామిన్ అనే మందు ఉందని, అది కూడా డాక్టర్లు సూచించే దానికన్నా 5 వేల రెట్లు అధికంగా ఉందని నిపుణులు తెలిపారు. ఇంత జరిగితే ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు బ్రయాన్‌కు కేవలం 60 రోజుల జైలుశిక్ష విధించడం చర్చనీయాంశమైంది.

Related posts