telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

నేటి నుంచి రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ

AP Local Body Elections 2020 Reservation List Finalaized

ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు మొత్తం పంచాయతీ ఎన్నికల చుట్టే తిరుగుతున్నాయి.  నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ వర్సెస్‌, వైసీపీగా ఏపీ పాలిటిక్స్‌ నడుస్తున్నాయి. అయితే.. వైసీపీ నేతలు ఎన్ని కామెంట్లు చేసినా… నిమ్మగడ్డ తగ్గడం లేదు. ఇది ఇలా ఉండగా… నేటి నుంచి ఏపీలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.. 13 జిల్లాల్లోని 20 రెవెన్యూ డివిజన్లు 175 మండలాల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.. మొత్తం 3,335 పంచాయతీలు, 33,632 వార్డులకు రెండో విడతలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం.. మంగళవారం ఉదయం 10.30 గంటల నుంచి రెండోదఫా ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది.. నేటి నుంచి ఈ నెల 4వ తేదీ సాయంత్రం 5 గంటలకు వరకు నామినేషన్లు వేసేందుకు తుది గడువుగా నిర్ణయించింది ఎస్‌ఈసీ.. ఫిబ్రవరి 5న నామినేషన్ల పరిశీలన జరగనుంది.. ఫిబ్రవరి 6న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించనున్నారు. ఇక, ఫిబ్రవరి 7న అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఫిబ్రవరి 8న నామినేషన్ల ఉప సంహరణకు తుది గడువు కాగా.. ఫిబ్రవరి 13న రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు. ఫలితాల వెల్లడి అనంతరం అదే రోజున ఉప సర్పంచ్‌ ఎన్నిక కూడా ఉంటుంది. 

Related posts