telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కొత్త ఏడాది రోజున వ్యాక్సిన్ వస్తుందా…?

corona vacccine covid-19

ప్రపంచాన్ని వణికిసచిన కరోనా ఇంకా మన దేశాన్ని వదలి పెట్టలేదు. కానీ దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.  రోజుకు 80 వేలకు పైగా కేసులు నమోదయ్యే స్థానంలో రోజుకు 20 వేల వరకు కేసులు నమోదవుతున్నాయి.  అయితే, కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నా సెకండ్ వేవ్, కొత్త స్ట్రైన్ నుంచి ముప్పు పొంచి ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.  ఇక ఇదిలా ఉంటె, కరోనా మహమ్మారిని అరికట్టాలి అంటే వ్యాక్సిన్ రావాలి.  వ్యాక్సిన్ కోసమే అందరూ ఎదురు చూస్తున్నారు.  ఈ సమయంలో ఆక్స్ ఫర్డ్ తయారు చేసిన వ్యాక్సిన్ కు యూకే ఆమోదం లభించింది.  ఈరోజు ఎక్స్ పర్ట్ కమిటీ సమావేశం నిర్వహించి ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కు అనుమతులు ఇస్తుందని అనుకున్నారు.  ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ తో పాటుగా భారత్ బయోటెక్, ఫైజర్ సంస్థలు కూడా అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి.  ఫైజర్ కంపెనీని అదనపు డేటాను అడిగిన సంగతి తెలిసిందే.  ఇక ఈ మూడు వ్యాక్సిన్లపై ఎక్స్ పర్ట్ కమిటీ కొత్త సంవత్సరం రోజున నిర్ణయం తీసుకోబోతున్నది.  కమిటీ నిర్ణయాన్ని బట్టి కేంద్ర ఆరోగ్యశాఖ వ్యాక్సిన్లపై ఓ ప్రకటన చెయ్యొచ్చు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts