telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీ లో మరోసారి పంచాయతీ ఎన్నికలు…

ఏపీలో ఈ మధ్యే పంచాయతీ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరూ మున్సిపల్ ఎన్నికలపై దృష్టి పెట్టారు. అన్ని పార్టీలు మున్సిపల్ ఎన్నికల హడావుడిలో ఉన్నాయి.  ప్రచారం నిర్వహించుకుంటున్నాయి.  ఈనెల 10 వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. 14 వ తేదీన రిజల్ట్ ఉంటాయి. ఇటీవలే రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ముగిసాయి.  కొన్ని గ్రామ పంచాయతీలు మినహాయించి అన్ని పంచాయతీల్లో ఎన్నికలు సజావుగా ముగిసిన సంగతి తెలిసిందే.  ఏ గ్రామపంచాయతీల్లో అయితే ఎన్నికలు జరగలేదో ఆ గ్రామ పంచాయతీల్లో తిరిగి ఎన్నికలు నిర్వహించేందుకు ఏపీ ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.  మొత్తం 372 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి.  మార్చి 6 సాయంత్రం 5 గంటల వరకు పంచాయతీ ఎన్నికల నామినేషన్లకు గడువు ఉన్నది.  మార్చి 7 వ తేదీ ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన, 8 వ తేదీన నామినేషన్ల పై ఫిర్యాదుల స్వీకరణ, 10 వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉంటాయి.  13 వ తేదీ సాయంత్రం 7:30 గంటల వరకు అభ్యర్థులు ప్రచారం నిర్వహించుకోవచ్చు.  మార్చి 15 వ తేదీ ఉదయం 6 గంటల నుంచి పోలింగ్ అదే రోజు సాయంత్రం రిజల్ట్ ఉంటాయి. చూడాలి మరి ఈ ఎన్నికలో ఎవరు తమ సత్తా చాటుతారు అనేది.

Related posts