telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

వీడియో వైరల్  : కాకులు కూడా రిపోర్టింగ్ చేస్తున్నాయంట…!?

Seagull blocks London traffic camera

బిజీగా ఉండే రోడ్లపై సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు అధికారులు ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తూ ఉంటారు. లండన్‌లో బిజీగా ఉండే ఓ రోడ్డుపై ఉండే కెమెరా ముందు కొద్ది రోజులుగా రెండు సముద్రపుకాకులు(సీగల్స్) వచ్చి వాలుతున్నాయి. కెమెరా ముందు సముద్రపుకాకి చేస్తున్నదృశ్యాల్ని చూస్తున్న లండన్ ట్రాన్స్‌పోర్ట్ అధికారులు వాటికి గ్రేమ్, స్టీవ్ అంటూ పేర్లు కూడా పెట్టారు. తమ రెండు రిపోర్టర్ కాకులు ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు తమకు అప్‌డేట్స్ ఇస్తున్నాయంటూ అధికారులు సరదాగా ట్విటర్‌లో ఓ ఫొటోను పోస్ట్ చేయగా.. ఆ పోస్ట్‌కు వేలల్లో లైక్స్ వస్తున్నాయి. హ్యాపీ మండే అంటూ అధికారులు సముద్రపుకాకి ఫొటోను తీసి పోస్ట్ చేశారు. ఈ వార్త లండన్ వ్యాప్తంగా ప్రస్తుతం ట్రెండింగ్ అయ్యింది.

Related posts