telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

స్కూళ్ళు తెరిచేందుకు మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్న కేంద్రం!

school students

కరోనా వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలలను తిరిగి తెరిచేందుకు కేంద్రం మార్గదర్శకాలు సిద్ధం చేస్తోంది. సెప్టెంబరు 1 నుంచి నవంబరు 14 మధ్య దశల వారీగా బడులు తెరవాలని నిర్ణయించింది. అయితే, ఈ విషయంలో స్థానిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకునే అధికారాన్ని మాత్రం రాష్ట్రాలకే వదిలేసింది.

అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా ఈ నెలాఖరు నాటికి విస్తృతస్థాయి ‘స్టాండింగ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్’ను విడుదల చేయనుంది. ఆగస్టు 31 తర్వాత అనుసరించాల్సిన విధివిధానాలను ఇందులో పేర్కొననుంది. విద్యార్థులు ఎప్పుడు, ఏ విధానంలో తరగతులకు హాజరుకావొచ్చన్నది రాష్ట్రప్రభుత్వాలే నిర్ణయించాల్సి ఉంటుంది. బోధన సిబ్బంది, విద్యార్థుల్లో 33 శాతం సామర్థ్యంతో షిఫ్టుల వారీగా తరగతులను నడపాలని, అలాగే, విద్యార్థులు క్లాస్ రూముల్లో 2, 3 గంటలకు మించి ఉండకుండా చూడాలని కేంద్రం తన మార్గదర్శకాల్లో స్పష్టం చేయనుంది.

Related posts