telugu navyamedia
వార్తలు సామాజిక

పాఠశాలకు రూ.618 కోట్ల విద్యుత్ బిల్లు…షాక్ కు గురైన యాజమాన్యం

current meeter billing

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ ప్రైవేట్ పాఠశాలకు వచ్చిన విద్యుత్ బిల్లు చూసి యాజమాన్యం నివ్వెరపోయింది. పాఠశాలకు ఏకంగా రూ.618 కోట్ల కరెంట్ బిల్లును వేశారు. ప్రధాని మోదీ పార్లమెంట్ నియోజకవర్గం వారణాసి పటణం వినాయక్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఊహించని విద్యుత్ ఛార్జీతో పాఠశాల యాజమాన్యం షాక్ కు గురైంది.

ఘటనపై విద్యుత్ అధికారులకు పాఠశాల యాజమాన్యం ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోని అధికారులు ఈ నెల 7వ తేదీ లోపు విద్యుత్ బిల్లు చెల్లించకుంటే పాఠశాలకు కరెంటు నిలిపివేస్తామని నోటీసులు జారీ చేశారు. ఉన్నతాధికారులను వివరణ కోరగా, సాఫ్ట్ వేర్ సమస్య కారణంగానే బిల్లింగ్ లో పొరపాటు జరిగిందని వెల్లడించారు.

Related posts