telugu navyamedia
crime study news trending

పాఠశాల బస్సుకు.. స్థితి చూడండి .. ప్రమాదాలు ఎన్ని జరిగినా .. ముందు జాగర్త ఇదేనా..!!

school bus without gare rod

ఆర్థిక రాజధాని ముంబైలో పాఠశాల బస్సు స్థితి చూస్తేనే, అధికారులు పసిపిల్లల ప్రాణాలకు ఏమాత్రం విలువ ఇస్తున్నారో అర్ధం అవుతుంది. కనీస సౌకర్యాలు లేని బస్సులకు రోడ్డుపై తిరిగే హక్కులు ఇచ్చిన అధికారులు ప్రమాదాలు జరిగితే బాధ్యత వహిస్తారా! ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాలు చూసికూడా ఇంతటి నిర్లక్ష్యమా; రేపటి పౌరుల ప్రాణాలు ఇదేనా భద్రత! మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఓ ప్రయివేటు పాఠశాల బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం వహించాడు. బస్సు గేర్‌ లివర్‌ స్థానంలో వెదురు కర్రను అమర్చి మూడు రోజుల పాటు బస్సును నడిపాడు.

ఫిబ్రవరి 5వ తేదీన గేర్‌ లివర్‌ స్థానంలో అమర్చిన వెదురు కర్ర పని చేయకపోవడంతో అదుపుతప్పిన బస్సు.. బీఎండబ్ల్యూ కారును ఢీకొట్టింది. కారు యజమాని బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు.. బస్సును సీజ్‌ చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంపై డ్రైవర్‌ను పోలీసులు ప్రశ్నించగా.. గేర్‌ లివర్‌ పాడైపోయింది. దాన్ని రిపేర్‌ చేయించడానికి సమయం లేకపోవడంతో.. దాని స్థానంలో వెదురుకర్రను ఉపయోగించి గత మూడు రోజుల నుంచి డ్రైవింగ్‌ చేస్తున్నానని తెలిపాడు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో విద్యార్థులున్నప్పటికీ వారికి ఎలాంటి గాయాలు కాలేదు. దానితో పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

Related posts

నిండు కుండలా.. ప్రోజెక్టుల కళకళ … టూరిస్టుల తో సందడి .. ఘోరంగా ట్రాఫిక్ జామ్..

vimala p

ఆర్టికల్ 370 రద్దును … స్వాగతిస్తున్న కాంగ్రెస్ ..

vimala p

తమ అదుపులో ఉన్నది ఇద్దరు కాదు ఒక్కరే: పాక్

vimala p